- Telugu News Photo Gallery Union Minister Dharmendra Pradhan visits BPCL 2G ethanol biorefinery at Bargarh district of Odisha
Dharmendra Pradhan: బార్‌ఘర్ 2G బయో-రిఫైనరీతో ఆర్థిక వృద్ధి.. పనులను పరిశీలించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan visits BPCL 2G ethanol biorefinery: ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలన - సేవను పురస్కరించుకుని వికాస్‌తీర్థ యాత్రలో భాగంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న BPCL 2G ఇథనాల్ బయోరిఫైనరీని సందర్శించారు.
Updated on: Jun 11, 2023 | 4:06 PM

ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలన - సేవను పురస్కరించుకుని వికాస్‌తీర్థ యాత్రలో భాగంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న BPCL 2G ఇథనాల్ బయోరిఫైనరీని సందర్శించారు. ఈ సందర్భంగా 2G బయో-రిఫైనరీ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఒడిశా పర్యటనలో ఆదివారం ఉదయం చేరుకున్న ధర్మేంద్ర ప్రధాన్ కు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బార్‌గఢ్ BPCL 2G ఇథనాల్ బయోరిఫైనరీని సందర్శించి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు.

బార్‌ఘర్ 2G బయో-రిఫైనరీ హరిత వృద్ధికి, స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల సేవకు గుర్తుగా వికాస్ తీర్థ్ యాత్రలో భాగంగా.. పురోగతిలో ఉన్న పనులు, పూర్తయిన పలుప్రాజెక్టుల సందర్శనలో భాగంగా BPC లిమిటెడ్ biorefineryని సందర్శించినట్లు తెలిపారు. బార్‌ఘర్ బయో-రిఫైనరీ స్థిరమైన పురోగతిని సాధిస్తోందని.. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

బార్‌ఘర్ 2G బయో-రిఫైనరీ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని.. వ్యర్థాల నుంచి సంపద సృష్టికి ప్రేరణనిస్తుందని తెలిపారు. రైతుల ఆదాయాన్ని, సంక్షేమాన్ని పెంచుతుందన్నారు. పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టిస్తుందని.. దేశీయంగా హరిత ఇంధన ఉత్పత్తిని పెంచుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల ద్వారా ఒడిశా అభివృద్ధికి దోహదపడటంతోపాటు.. స్వావలంబన వైపు నడిపిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

ఒడిశా మరియు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో గ్రీన్‌గ్రోత్ జరగుతుందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రభుత్వం రాబోయే లేదా నిర్మించబోయే బయో-రిఫైనరీలను దృష్టిలో ఉంచుకుని, స్థానిక యువతను హరిత ఉద్యోగాలతో అనుసంధానించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ప్రాంతీయ భాషలో ప్రభుత్వ ITIలో ఇథనాల్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్ & టెక్నాలజీకి సంబంధించిన సంబంధిత కోర్సులు & మాడ్యూళ్లను రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం సమర్థ, నైపుణ్యం కలిగిన మానవశక్తిని కూడా సిద్ధం చేస్తుందని తెలిపారు.





























