Viral Video: భార్యతో గొడవపడి ఏకంగా 100 అడుగుల టవర్ ఎక్కిన భర్త.. కట్ చేస్తే

భార్య భర్తల మధ్య తగాదాలు రావడం చాలా కామన్.. ఇంటిపోరు తట్టుకోలేక కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. మొన్నామధ్య భార్య భాదితుల సంఘంకూడా మొదలైంది.

Viral Video: భార్యతో గొడవపడి ఏకంగా 100 అడుగుల టవర్ ఎక్కిన భర్త.. కట్ చేస్తే
Drunk Man
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 23, 2022 | 7:04 PM

Viral Video: భార్య- భర్తల మధ్య తగాదాలు రావడం చాలా కామన్.. ఇంటిపోరు తట్టుకోలేక కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. మొన్నామధ్య భార్య భాదితుల సంఘంకూడా మొదలైంది. భార్యలు గొడవల కారణంగా, కొన్నిసార్లు ఇల్లు వదిలి వెళ్లడం గురించి మనం వింటూ ఉంటాం.. తరువాత, ఎవరైనా చొరవ తీసుకొని గొడవ సర్దుబాటు చేస్తూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి  గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిన భార్య కోసం చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో గత బుధవారం చోటుచేసుకుంది. విడిపోయిన భార్యను తిరిగి పొందేందుకు ఓ వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు. చాలా ప్రమాదకరమైన పని చేశాడు.

భార్య కోసం ఏకంగా వంద అడుగుల పొడవైన టవర్ ఎక్కి హంగామా చేశాడు. అతడితో గొడవపడి భార్య సొంత ఇంట్లోనే ఉంటోంది. దాంతో ఆమె కావాలని, లేకుంటే కిందికిన్ దిగాను అని మారం చేశాడు.  అతడిని కిందికి దించేందుకు స్థానికులు, అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే అతడు మద్యం సేవించి ఉన్నడని స్థానికులు అంటున్నారు. నానా కష్టాలు పడి నాలుగు గంటల తర్వాత టవర్‌పై నుంచి కిందకు దించారు. అతడిని అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి