Viral News: ఉచితంగా హెల్మెట్‌ ఇవ్వలేదని షోరూమ్‌ యజమానిపై కేసు నమోదు.. దిగొచ్చిన కంపెనీ..

Viral News: కొత్త బైక్ కొనుగోలు చేస్తే ఉచితంగా హెల్మెట్ ఇవ్వలేదన్న కారణంగా ఓ వ్యక్తి షోరూమ్‌ యజమానిపై కేసు నమోదు చేశాడు. దీంతో ఏకంగా సదరు బైక్‌ కంపెనీ సీఈఓనే స్పందించాల్సి వచ్చింది. ఈ విచిత్రమైన ఘటన పుణెలోని కోత్రుడ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

Viral News: ఉచితంగా హెల్మెట్‌ ఇవ్వలేదని షోరూమ్‌ యజమానిపై కేసు నమోదు.. దిగొచ్చిన కంపెనీ..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 15, 2022 | 3:35 PM

Viral News: కొత్త బైక్ కొనుగోలు చేస్తే ఉచితంగా హెల్మెట్ ఇవ్వలేదన్న కారణంగా ఓ వ్యక్తి షోరూమ్‌ యజమానిపై కేసు నమోదు చేశాడు. దీంతో ఏకంగా సదరు బైక్‌ కంపెనీ సీఈఓనే స్పందించాల్సి వచ్చింది. ఈ విచిత్రమైన ఘటన పుణెలోని కోత్రుడ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అభిషేక్‌ హరిదాస్‌ అనే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ బైక్‌ షోరూమ్‌లో ఇటీవల బైక్‌ను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో బైక్‌ షోరూమ్‌ వాళ్లు హెల్మెట్‌లు ఇవ్వలేదు. అయితే 2019లో ముంబయి హైకోర్టు ఔరంగబాద్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు ప్రకారం బైక్‌ కొనుగోలు చేసిన వారికి రెండు హెల్మెట్‌లు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని అతిక్రమించారన్న కారణంగా అభిషేక్‌ షోరూమ్ పై కేసు నమోదు చేశాడు.

ఈ విషయమై అభిషేక్‌ మాట్లాడుతూ.. ‘హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు బైక్‌ కొనుగోలు చేసే సమయంలో షోరూమ్‌ వాళ్లు ఉచితంగా హెల్మెట్‌లు ఇవ్వకపోతే ఆర్‌టీఓ ఆఫీసులో బైక్‌ రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. కానీ నాకు షోరూమ్‌ వాళ్లు హెల్మెట్‌ ఇవ్వకపోయినా బైక్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. షోరూమ్‌ వాళ్లను ఎంత అడిగినా హెల్మెట్‌లు ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చారు. అభిషేక్‌ తరఫు న్యాయవాదులు షోరూమ్‌ యజమానికి లీగల్‌ నోటీసులు జారీ చేశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అభిషేక్‌ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు.

ఇదిలా ఉంటే విషయం కాస్త పెద్దది కావడంతో సదరు కంపెనీ దిగొచ్చింది. అభిషేక్‌ తరఫు లాయర్లు జారీ చేసిన నోటీసులు అందిన వెంటనే, హెల్మెట్లు తీసుకోవడానికి అతన్ని పిలిచినట్లు కంపెనీ సీఈఓ ప్రదీప్‌ సావంత్‌ తెలిపారు. అయితే అభిషేక్‌ రాలేదని, గురువారం కూడా అతని కోసం ఎదురు చూశామని, అభిషేక్‌ ఎప్పుడు వచ్చినా హెల్మెట్‌లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Also Read: KTR: వరి పంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని ప్రయత్నించారు.. బీజేపీపై కేటీఆర్ ఫైర్

Pakistan: పాకిస్థాన్‌లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుపై ఏకంగా రూ.100..

KKR vs SRH Playing 11 IPL 2022: కేకేఆర్‌తో పోరుకు సిద్ధమైన హైదరాబాద్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే