AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మద్యం కంపెనీలో పని చేస్తే.. నెలకు రూ. 7 లక్షలు జీతమిస్తారట.. ఇంతకీ పనేంటంటే.!

California Winery Job: పని అనేది అందరికీ ఓ కల అనిపించేలా ప్రపంచంలోని పలు కంపెనీలు ఎన్నో లగ్జరీ సౌకర్యాలను అందిస్తూ ఉంటాయి...

ఈ మద్యం కంపెనీలో పని చేస్తే.. నెలకు రూ. 7 లక్షలు జీతమిస్తారట.. ఇంతకీ పనేంటంటే.!
Winery
Ravi Kiran
|

Updated on: Mar 23, 2021 | 9:52 AM

Share

California Winery Job: పని అనేది అందరికీ ఓ కల అనిపించేలా ప్రపంచంలోని పలు కంపెనీలు ఎన్నో లగ్జరీ సౌకర్యాలను అందిస్తూ ఉంటాయి. ఇక ఈరోజు అలాంటి ఓ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. అక్కడ అందమైన జీతంతో పాటు అనేక ఇతర అద్భుతమైన సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఇది మాత్రమే కాదు, ఉద్యోగులు తమకు నచ్చిన పని చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు ఆ సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం…

కాలిఫోర్నియాలోని సోనొమాకు చెందిన మర్ఫీ గూడె వైనరీ అనే పేరు గల మద్యం కంపెనీ నిరుద్యోగులకు సువర్ణావకాశం కల్పించింది. ఆ సంస్థలోని ఓ ఖాళీని భర్తీ చేసేందుకు అర్హులను ఆహ్వానించింది. ఆ పోస్టుకు ఏకంగా రూ. 7.24 లక్షలు ఇవ్వనుంది. ఇలా ఆకర్షితమైన శాలరీతో పాటు మిగిలిన లగ్జరీ బెనిఫిట్స్ కూడా ఇస్తోంది. ఉద్యోగులకు ఉచిత బస, ఫుడ్‌ను కల్పిస్తోంది. అయితే ఈ ఉద్యోగం కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే. ఈ సంస్థలో ఉద్యోగం పొందిన ఎవరికైనా కూడా తమకు నచ్చిన వైనరీలో పనిచేసే అవకాశం దొరుకుతుంది.

అద్భుతమైన ఆఫర్..!

అక్కడి మీడియా కథనాల ప్రకారం, ఈ సంస్థలో ఉద్యోగం పొందిన వ్యక్తి ఎవరైనా కూడా వారి అభిరుచికి తగ్గట్టు పని చేయవచ్చునట. ఏదేమైనా, మొదటి కొన్ని నెలలు, ఉద్యోగి వైనరీలోని అన్ని రకాల పనులు చేయవలసి ఉంటుంది. దానికి అక్కడ పనిచేస్తోన్న వారు శిక్షణ కూడా ఇస్తారట. ఎప్పుడైతే ఉద్యోగులు అక్కడున్న విషయాలను అర్ధం చేసుకుంటారో.. అప్పటి నుంచి వారి అభిరుచికి అనుగుణంగా పనిచేసే అవకాశం లభిస్తుంది. ఇక వారు చేసేదల్లా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ సంవత్సరమంతా మద్యం టేస్ట్ చేయడమే అని సమాచారం.అటు ఉద్యోగులకు ఈ-కామర్స్‌పై పూర్తి అవగాహన ఉండాలి. కొన్నిసార్లు వారు వేర్వేరు టీమ్స్‌ను కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారు కనీసం 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అలాగే, అమెరికాలో పనిచేయడానికి అభ్యర్థికి అనుమతి అవసరం. అభ్యర్థి తన గురించి మొత్తం సమాచారాన్ని వీడియో రూపంలో పంపించాలి. మీరు కూడా ఇక్కడ పని చేయాలనుకుంటే, జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోండి.

Also Read:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!