Viral Video: బుల్లెట్‌పై వస్తుండగా ఎదురొచ్చిన యముడు.. కట్ చేస్తే, క్షణాల్లోనే అంతా ముగిసింది..
Viral Video: మరణం ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోతాడు. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు...
Viral Video: మరణం ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోతాడు. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆయుష్షు లేకపోతే మాత్రం మరణం సంభవిస్తుంది. సీసీ టీవీ కెమెరాలు, సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏ సంఘటన జరిగినా వెంటనే వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. బుల్లెట్ బండిపై రయ్యిమంటూ దూసుకొస్తున్న ఓ కుర్రాడి మృత్యువు గేదే రూపంలో వచ్చింది. సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ గేదేను వెంటబెట్టుకొని రోడ్డుపై వెళుతోన్న సమయంలో ఓ కుర్రాడు బుల్లెట్ బండిపై వేగంగా దూసుకొచ్చాడు. అయితే బుల్లెట్ బండి సౌండ్ పెద్దగా రావడం వల్లో మరే కారణమో కానీ గేదే ఒక్కసారిగా బెదిరిపోయింది. వెంటనే బైక్‌పై వస్తున్న కుర్రాడిని ఒక్కసారిగా ఢీ కొట్టింది.
దీంతో ఆ కుర్రాడు ఆ దాటికి బండిపై నుంచి కొంత దూరంలో పడిపొయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆ కుర్రాడు స్పాట్‌లోనే చనిపోయినట్లు సమాచారం. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..