మనుషులైనా.. జంతువులైనా.. తల్లి, బిడ్డల బంధాన్ని వర్ణించలేం. ఏ తల్లీ తన బిడ్డను విడిచి ఉండలేదు.. ఏ బిడ్డా తన తల్లిని విడిచి ఉండలేదు.. ఒకవేళ అలాంటి విపత్కర పరిస్థితే ఎదురైతే.. ఆ దృశ్యాన్ని చూడటం ఎవరితరం కాదు. కానీ, అలాంటి గుండెలు పిండేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు కన్నీటిపర్యంతం అవుతున్నారు. కొందరు దుర్మార్గుల తమ స్వార్థం కొద్ది చేసిన పనికి.. ఓ చిన్ని రైనో ఒంటరిదైంది. లోకాన్ని వీడిన తల్లి కోసం.. తల్లడిల్లిపోయింది. తల్లిని తడుముతూ.. ‘లే అమ్మ’ అన్నట్లుగా అటూ ఇటూ తిరగడం.. అందరి మనసులను కలచివేస్తోంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతనంద ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయింది.
వియాత్నం, చైనాలో ఖడ్గ మృగాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ కారణంగానే వేటగాళ్లు వాటిని వేటాడుతారు. తాజాగా కొందరు వేటగాళ్లు ఖడ్గ మృగం కోసం ఉచ్చు పెట్టగా.. అందులో చిక్కుకుని ఓ భారీ ఖడ్గ మృగం ప్రాణాలు కోల్పోయింది. అయితే, దానికి ఒక చిన్న పిల్ల కూడా ఉంది. ఆ పిల్ల రైనో.. చనిపోయిన తల్లి రైనో వద్ద అటూ ఇటూ తిరుగుతూ.. తల్లిని లేపేందుకు ప్రయత్నించింది. అయితే, తల్లి మరణించదని గ్రహించలేని ఆ చిన్నారి రైనోని చూస్తే కంటతడి పెట్టని వారు ఉండరు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను కంటతడిపెట్టిస్తుంది.
This clip shattered me. A baby rhino trying to wake up his mother, who was killed by poachers for her horn??
Demand for rhino horn in Vietnam and China, has pushed the remaining rhino populations to the brink of extinction. Please remember, it’s all due to our delusion.From WA pic.twitter.com/VAKHWj9Mn9
— Susanta Nanda (@susantananda3) May 1, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..