Viral: లైబ్రరీలో బుక్ చదువుతుండగా దొరికిన 1994 నాటి రసీదు.. అందులో ఏముందని చూడగా.!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి.. ప్రపంచం నలుమూలలా ఏ వింత జరిగినా.. అది క్షణాల్లో మన మొబైళ్లలో దర్శనమిస్తాయి. ఈ కోవలోనే తాజాగా బ్రిటన్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ పురాతన లైబ్రరీకి వెళ్లిన ఒక వ్యక్తికి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి.. ప్రపంచం నలుమూలలా ఏ వింత జరిగినా.. అది క్షణాల్లో మన మొబైళ్లలో దర్శనమిస్తాయి. ఈ కోవలోనే తాజాగా బ్రిటన్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ పురాతన లైబ్రరీకి వెళ్లిన ఒక వ్యక్తికి 1994 కాలం నాటి రసీదు దొరికింది. ఇంతకీ అందులో ఏముంది.? అసలు అదేంటి.? అనే విషయాలు మిమ్మల్ని ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వివరాల్లోకి వెళ్తే.. టెస్కో సూపర్ మార్కెట్ అనేది బ్రిటన్‌లోనే ఎంతో ప్రసిద్ది గాంచింది.
కోవెంట్రీ నగరానికి చెందిన ఓ పురాతన లైబ్రరీలో బుక్ చదివేందుకు వచ్చాడు ఒక వ్యక్తి. అతడు చదువుతుండగా.. ఆ బుక్‌లో 1994 కాలం నాటి టెస్కో సూపర్ మార్కెట్ రసీదు దొరికింది. ఆ రసీదులో పేర్కొన్న వస్తువుల ధరలు చూసి.. ఆ వ్యక్తి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ రసీదుపై 1994, జూలై 23.. మధ్యాహ్నం 3.30 గంటలని టైం పేర్కొని ఉంది. ఇక ఆ బిల్లులోని వస్తువులు ఇలా ఉన్నాయ్.
మిన్స్ బీఫ్ ధర 0.55 పౌండ్లు కాగా, బీఫ్ బర్గర్ ధర 1.39 పౌండ్లు, వంట నూనె ధర 0.65 పౌండ్లు, శాండ్‌విచ్ ధర రూ. 0.89 పౌండ్లు. లూజ్ బనానాస్ 0.18 పౌండ్లు. మొత్తం బిల్లు 29.39 పౌండ్లుగా ఉంది. కాగా, ఈ బిల్లు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
A 1994 Tesco receipt found in a library book byu/lukestrim inCasualUK
