ట్రైన్‌లోని ఏసీ భోగి వద్ద అనుమానాస్పదంగా 4 బ్యాగులు.. పోలీసులు వాటిని ఓపెన్ చేయగా

|

Jul 04, 2024 | 7:49 PM

మరికొద్దిసేపట్లో డిబ్రూగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు రానుంది. ఈ అనౌన్స్‌మెంట్ న్యూ-అలీపుర్‌దూర్ స్టేషన్‌లో హోరెత్తింది. ఒక్కొక్కరిగా ఆ ట్రైన్ ఎక్కే ప్రయాణీకులు తమ బ్యాగ్‌లు సర్దుకోవడం మొదలుపెట్టారు. ఎవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు..

ట్రైన్‌లోని ఏసీ భోగి వద్ద అనుమానాస్పదంగా 4 బ్యాగులు.. పోలీసులు వాటిని ఓపెన్ చేయగా
Rajadhani Express
Follow us on

మరికొద్దిసేపట్లో డిబ్రూగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు రానుంది. ఈ అనౌన్స్‌మెంట్ న్యూ-అలీపుర్‌దూర్ స్టేషన్‌లో హోరెత్తింది. ఒక్కొక్కరిగా ఆ ట్రైన్ ఎక్కే ప్రయాణీకులు తమ బ్యాగ్‌లు సర్దుకోవడం మొదలుపెట్టారు. ఎవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఈలోగా ఎక్కడ నుంచి వచ్చారో గానీ.. ఓ పది, పన్నెండు మంది పోలీసులు ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. స్టేషన్‌లో ట్రైన్ ఆగగానే.. బీ1 సెకండ్ ఏసీ కోచ్‌లోకి పోలీసులు పరుగులు పెట్టారు. లోపలి వెళ్లగానే వారికి బెడ్ రోల్ బాక్స్ దగ్గర 4 ట్రాలీ బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు.

ఆ బ్యాగులలో సుమారు 11 ప్యాకెట్లలో 99 కిలోల గంజాయిని సీఐబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 9.90 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పట్టుకున్న గంజాయిని ఇప్పటికే అధికారులు అలీపూర్‌దువార్‌లోని సీఐబీ కార్యాలయానికి తరలించారు. పక్కా ఇంటిలిజెన్స్ బృందం సమాచారంతో సీఐబీ అధికారులు ఈ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఈ తతంగానికి కారణమైన కుశాల్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సీఐబీ అధికారులు. ట్రైన్ ఆగిన వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్నారు. కుశాల్ కుమార్ సొంతూరు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌గా గుర్తించారు పోలీసులు. నిందితుడ్ని అరెస్ట్ చేసి న్యూకూచ్ బెహర్‌లోని జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని ఎక్కడ నుంచి తీసుకొచ్చాడు.? ఎవరికి అందిస్తున్నాడు.? అన్నదానిపై సీఐబీ అధికారులు ఆరా తీస్తున్నారు.(Source)

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆ మ్యాచ్‌తో కోహ్లీ గెట్ అవుట్.. కానీ ధోనినే.! 11 ఏళ్ల టాప్ సీక్రెట్ బయటపెట్టిన పాక్ ప్లేయర్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి