Crocodile: ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్.!
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, జలపాతాలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో అక్కడక్కడా జలచరాలు జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నాయి. తాజాగా రత్నగిరి జిల్లాలోని తీరప్రాంతమైన చిప్లన్ లోని చించ్ నాకా పరిసరాల్లో ఆదివారం రాత్రి ఓ 8 అడుగుల మొసలి పక్కనే ఉన్న నది నుంచి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా స్వేచ్ఛగా తిరుగుతూ హల్ చల్ చేసింది.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, జలపాతాలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో అక్కడక్కడా జలచరాలు జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నాయి. తాజాగా రత్నగిరి జిల్లాలోని తీరప్రాంతమైన చిప్లన్ లోని చించ్ నాకా పరిసరాల్లో ఆదివారం రాత్రి ఓ 8 అడుగుల మొసలి పక్కనే ఉన్న నది నుంచి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా స్వేచ్ఛగా తిరుగుతూ హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రోడ్డుపై మొసలి ఠీవీగా సంచరించడాన్ని చూసిన స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు.
రత్నగిరి జిల్లాలో చిత్తడి నేలలో మొసళ్లు అధికంగా జీవిస్తున్నాయి. వాటిని మగ్గర్స్ అంటారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొసళ్లకు ఆవాసంగా ఉన్న శివ నది నుంచి ఈ మొసలి కొట్టుకొచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే మొసళ్లు జనావాసంలోకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని తీర ప్రాంతవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల యూపీలోని బులంద్ షహర్ లోనూ ఈ తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడి గంగా నది కాలువ నుంచి ఓ 10 అడుగుల భారీ మొసలి బయటకు వచ్చింది. అధికారులు దాన్ని పట్టుకొనేందుకు ప్రయత్నించగా ఇనుపు రెయిలింగ్ మీద నుంచి దూకేందుకు ప్రయత్నించింది. చివరకు అధికారులు దాన్ని బంధించి తిరిగి నీటిలో విడిచిపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

