Rocket Crash: దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు..
లాంచ్‌ప్యాడ్ వద్ద ఉంచిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిన ఘటన చైనా లో చోటుచేసుకొంది. బీజింగ్ తియాన్‌లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ ఆదివారం ఈ విషయాన్ని బయటపెట్టింది. తాము అభివృద్ధి చేస్తున్న తియాన్‌లాంగ్-3 అనే రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపోయిందనీ ఇది సెంట్రల్ చైనాలోని గాంగ్యీ అనే పర్వత ప్రాంతంలో పడిందనీ అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదనీ తెలిపింది.
లాంచ్‌ప్యాడ్ వద్ద ఉంచిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిన ఘటన చైనా లో చోటుచేసుకొంది. బీజింగ్ తియాన్‌లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ ఆదివారం ఈ విషయాన్ని బయటపెట్టింది. తాము అభివృద్ధి చేస్తున్న తియాన్‌లాంగ్-3 అనే రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపోయిందనీ ఇది సెంట్రల్ చైనాలోని గాంగ్యీ అనే పర్వత ప్రాంతంలో పడిందనీ అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదనీ తెలిపింది. ఈ భాగాన్ని పరీక్షిస్తున్న సమయంలోనే నిర్మాణలోపాలు బయటపడ్డాయని కంపెనీ పేర్కొంది. ఈ రాకెట్ పడటం వల్ల అక్కడి అడవిలో భారీ పేలుడు చోటుచేసుకొని పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక బృందాలు ఆ మంటల్ని ఆర్పేశాయి. తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
తియాన్‌లాంగ్-3 రాకెట్‌ను చైనా స్కైడ్రాగన్ 3 పేరిట అభివృద్ధి చేస్తోంది. ఇది రెండంచెల వ్యవస్థగా పని చేస్తుంది. వీటిని పాక్షికంగా పునర్వినియోగించుకోవచ్చు. చైనాలో రాకెట్ ప్రయోగ రంగంలోకి ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు. దీంతో పలు కంపెనీలు తమ ప్రయోగశాలలను ఏర్పాటుచేశాయి. హెనాన్ ప్రావిన్స్‌లో ఈ సంస్థ ఉన్నచోట దాదాపు 8 లక్షల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇటీవల జూన్ 22న చైనాలోని ఓ గ్రామంపై రాకెట్ శిథిలాలు కూలాయి. షీఛాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్‌మార్చ్-2 రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అవి జనావాసాలపై పడ్డాయి. ఈ ఘటన సిచువాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

