Viral: నీటిలో తేలుకుంటూ వచ్చిన మనిషి పుర్రె భాగం.. పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు షాక్

దొరికిన పుర్రె క్రీస్తు పూర్వం 5,500 నుంచి 6,000 సంవత్సరాల మధ్య జీవించిన వ్యక్తి పుర్రె అని పరిశోధకులు చెబుతున్నారు. పుర్రె భాగంలో గాయాలు కనిపించాయని, అయితే ఈ గాయంతో వ్యక్తి చనిపోలేదని వారు చెబుతున్నారు. ఎందుకంటే ఎముక తిరిగి పెరగడం అనేది కోలుకునే సంకేతాలను చూపుతోంది. ఈ వ్యక్తి గాయం నుండి బయటపడినట్లు చూపిస్తుంది. ఆపై మరో కారణం చేత అతను చనిపోయి ఉండవచ్చు అన్నది వారి వెర్షన్.

Viral: నీటిలో తేలుకుంటూ వచ్చిన మనిషి పుర్రె భాగం.. పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు షాక్
8000 Year Old Human Skull
Follow us

|

Updated on: May 27, 2022 | 5:52 PM

యూఎస్‌లోని మిన్నెసోటా నది(Minnesota River)కి సమీపంలో మానవ పుర్రెలోని కొంతభాగాన్ని గత ఏడాది వేసవిలో ఇద్దరు వ్యక్తులు కనుగొన్నారు. దీంతో వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ పుర్రె హత్య లేదా ఆత్మహత్య కేసుకు సంబంధించినదిగా భావించి.. పరిశోధన కోసం ల్యాబ్‌కు తరలించారు. అనంతరం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడ ఫోరెన్సిక్ మానవ శాస్త్రవేత్త కార్బన్ రసాయనం(Carbon Dating) ఆధారంగా విశ్లేషించి సదరు పుర్రె క్రీస్తు పూర్వం 5,500 నుంచి 6,000 సంవత్సరాల మధ్య జీవించిన వ్యక్తి పుర్రె అని నిర్ధారించారు. ఈ ఎముక ఇన్నాళ్లూ నీటిలో ఉంద‌న్నది పరిశోధకులు అంచనా. అయితే తీవ్రమైన కరువు కారణంగా నదిలో నీటి మట్టం తగ్గి పుర్రె బయటకు వచ్చింది.  ఈ వ్యక్తి మొక్కలు, జింకలు, చేపలు, తాబేళ్లు, ముత్యాల మిల్లెట్, జొన్నలు తిని ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. స్థానిక అధికారులు ఈ పుర్రె ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన అనంతరం.. పలువురు అమెరికన్లు విమర్శల దాడి చేశారు.  పూర్వీకుల అవశేషాల ఫోటోలను పోస్ట్ చేయడం సంస్కృతికి అభ్యంతరకరమని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడి కార్యాలయం ఆ ఫోటోలను తొలగించింది. అయితే అప్పటికే ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ వార్త విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. భూమి అంత పాతది కాదని కొందరు వాదిస్తున్నారు.ఆ పుర్రెపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.

Skull

దొరికిన పుర్రె భాగం