అరె ఏంట్రా ఇది.. 80ఏళ్ల వరుడికి 80మంది సంతానం..! 32ఏళ్ల వధువుతో మళ్లీ పెళ్లి..
మెహందీ వేడుకతో సహా తమ తండ్రి వివాహంలో అన్ని ఆచారాలు ఎంతో ఘనంగా జరిగాయని పిల్లలే చెప్పారు. ఈ వివాహ వేడుకలో 80 ఏళ్ల వరుడి 80 మంది కుమారులు, కుమార్తెలు, మనవరాళ్ళు, మునిమనవళ్లు కూడా బ్యాండ్, డీజే పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అదరగొట్టారు. ఆయా బ్యాండ్ మోతాకు అనుగుణంగా సంతోషంగా భాంగ్రా నృత్యం చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదంతా తెలిసిన నెటిజన్లు

గత కొంతకాలంగా పాకిస్తాన్ నుండి అనేక ఆసక్తికరమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వార్తలు మనల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తే, మరికొన్ని వార్తలు పాకిస్తాన్‌ను నవ్వుల పాలు చేసేవిగా ఉంటున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్‌లో జరిగిన ఒక పెళ్లి వార్త విస్తృతంగా చర్చించబడుతోంది. ఎందుకంటే.. ఇది సాధారణ వివాహం కాదు ఈ పెళ్లిలో 80 ఏళ్ల వృద్ధుడు వరుడు అయ్యాడు. కాగా, వధువు వయస్సు 32 సంవత్సరాలు. అంతేకాదు.. వరుడి 80 మంది కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్ళు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
సమాచారం ప్రకారం.. ఈ వివాహం పాకిస్తాన్ పంజాబ్ లోని సర్గోధాలో జరిగింది. 80 ఏళ్ల వ్యక్తి పిల్లలు స్వయంగా ఈ వివాహాన్ని కుదిర్చారు. సర్గోధాలోని ముహమ్మది కాలనీలో నివసించే చాచా బషీర్, 32 ఏళ్ల మహిళను చాలా అట్టహాసంగా, అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. తండ్రి ఒంటరితనాన్ని చూడలేక అతని పిల్లలు ఈ వివాహాన్ని వారే కుదిర్చారని చెబుతున్నారు. 80 ఏళ్ల వృద్ధుడి వివాహం కోసం అతని కుమారులు భారీ ఏర్పాటు చేశారు. అన్ని ఆచారాలు సంపద్రాయబద్ధంగా జరిగాయి. వరుడు 25 ఏళ్ల యువకుడిలా మెహందీ వేడుకను కూడా నిర్వహించారు.
عمر میں کیا رکھا ہے 80سالہ بابا بشیر کی شادی#Wedding #Bababashir #sargodha #ExpressNews #BreakingNews #LatestUpdates pic.twitter.com/uxVybe7Xu8
— Express News (@ExpressNewsPK) February 4, 2025
మెహందీ వేడుకతో సహా తమ తండ్రి వివాహంలో అన్ని ఆచారాలు ఎంతో ఘనంగా జరిగాయని పిల్లలే చెప్పారు. ఈ వివాహ వేడుకలో 80 ఏళ్ల వరుడి 80 మంది కుమారులు, కుమార్తెలు, మనవరాళ్ళు, మునిమనవళ్లు కూడా బ్యాండ్, డీజే పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అదరగొట్టారు. ఆయా బ్యాండ్ మోతాకు అనుగుణంగా సంతోషంగా భాంగ్రా నృత్యం చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదంతా తెలిసిన నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




