Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ మట్టి కుండలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

సాధారణంగా పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు.. మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, అవశేషాలు బయటపడటం చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంభల్‌లోని అల్లీపూర్‌లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి.

Viral: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ మట్టి కుండలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్
Treasure
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 02, 2025 | 8:30 AM

సాధారణంగా పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు.. మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, అవశేషాలు బయటపడటం చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంభల్‌లోని అల్లీపూర్‌లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గురు అమరపతి మెమోరియల్ సైట్ వద్ద బయటపడిన ఈ నాణేలలో ఒక దానిపై సీతారాములు, లక్ష్మణుని చిత్రాలు ఉన్నట్టు గుర్తించారు. ఇతర నాణేలపై కూడా వివిధ రకాల బొమ్మలు చెప్పబడ్డాయి. ఇందులో కొన్ని బ్రిటీష్ కాలం నాటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ అమరపతి ఖేడా స్మారక ప్రదేశం 1920 నుంచి ఏఎస్ఐ రక్షణలో ఉంది.

అలాగే సోత్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశంలో గతంలో సమాధి ఉండేదని.. నది నీటి ప్రభావంతో మట్టి తొలిగిపోయినప్పుడు.. అక్కడ కొన్ని అస్థిపంజరాలు, కమండలం, రాయి కూడా కనిపించాయని స్థానికులు అంటున్నారు. సుమారు 21 మంది సాధువుల సమాధులు ఉన్నాయని, ఇటీవల ఓ ఆస్థిపంజరం కూడా బయటపడినట్టు తెలిపారు. అది గురు అమర్‌ సమాధిగా ఏఎస్‌ఐ రికార్డుల్లో ఉందని అన్నారు. మరోవైపు ఆ పురాతన నాణేలతో పాటు 4 వందల ఏళ్ల నాటి మట్టి పాత్రలు కూడా లభ్యమయ్యాయట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి