AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఏంటీ సుధా వీడు.. గర్ల్‌ఫ్రెండ్ కోరికలు తీర్చేందుకు ఏం పని చేశాడో తెలిస్తే షాకే

65 ఏళ్ల వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేస్తూ దొరికిపోయాడో ఎమ్మెల్యే పుత్రరత్నం. అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌ మాజీ ఎమ్మెల్యే అయిన విజేంద్రసింగ్ చంద్రావత్ కుమారుడు ప్రద్యుమన్ సింగ్‌ జనవరి 25న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వృద్ధురాలి మెడలో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Viral: ఏంటీ సుధా వీడు.. గర్ల్‌ఫ్రెండ్ కోరికలు తీర్చేందుకు ఏం పని చేశాడో తెలిస్తే షాకే
Telugu News
Ravi Kiran
|

Updated on: Feb 02, 2025 | 7:30 AM

Share

65 ఏళ్ల వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేస్తూ దొరికిపోయాడో ఎమ్మెల్యే పుత్రరత్నం. అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌ మాజీ ఎమ్మెల్యే అయిన విజేంద్రసింగ్ చంద్రావత్ కుమారుడు ప్రద్యుమన్ సింగ్‌ జనవరి 25న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. దాని విలువ రూ. 1.25 లక్షలు. బాధితురాలు వసంతిబెన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.

మొత్తం 250 సీసీటీవీల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా మలహెరా గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రద్యుమన్‌గా గుర్తించారు. అతడు మాజీ ఎమ్మెల్యే కుమారుడని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రద్యుమన్‌పై గతంలో ఎలాంటి కేసులు లేవని, ప్రేమికురాలికి డబ్బులు ఇచ్చేందుకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

అహ్మదాబాద్‌లో ప్రద్యుమన్ కేవలం రూ. 15 వేల జీతానికి పనిచేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. రోజువారీ ఖర్చులు వెళ్లదీసుకోవడంతోపాటు గాళ్‌ఫ్రెండ్‌కు డబ్బులు ఇచ్చేందుకు చోరీ చేయాలని నిర్ణయించుకుని ఈ చోరీకి పాల్పడినట్టు తెలిపారు. ప్రియురాలి కోరికలు తీర్చేందుకు జీతం సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం ఈ చోరీకి పాల్పడ్డాడని, ఇదే అతడికి మొదటిసారని పోలీసులు తెలిపారు. చోరీ చేసిన మంగళసూత్రాన్ని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..