నలుగురు వ్యక్తులు కలిసి అమెరికాను రూ.25 కోట్ల మేర మోసం చేశారు. ఈ నలుగురు 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన డైనోసార్ ఎముకలను దొంగిలించి చైనాకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిందితులు చేసిన పనితో శిలాజాల వాణిజ్య, శాస్త్రీయ విలువలతో కలిపి దేశానికి 3 మిలియన్ డాలర్లకు పైగా (అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 25 కోట్లు) నష్టం వాటిల్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Utah కి చెందిన యుఎస్ అటార్నీ ఆఫీసు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. నిందితులు వింట్ వేడ్, డోనా వేడ్, స్టీవెన్ విల్లింగ్ , జోర్డాన్ విల్లింగ్ లు కలిసి పాలియోంటాలాజికల్ రిసోర్సెస్ ప్రిజర్వేషన్ యాక్ట్ (PRPA)ని ఉల్లంఘించారు. డైనోసార్ శిలాజాలకు చెందిన రాళ్లు, ఎముకలు దొంగలించి వాటిని అక్రమంగా దేశం దాటించారని అనంతరం తమ నేరం నుంచి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించారు. అలా దొంగలించిన డైనో సార్ కు చెందిన శిలాజాలను తర్వాత చైనాకు విక్రయించారు.
ఈ నలుగురు కలిసి మార్చి 2018 నుంచి మార్చి 2023 మధ్య ప్రభుత్వ భూముల్లో అక్రమంగా డైనోసార్ ఎముకలను తవ్వి తీశారు. అనంతరం వాటిని చైనాకు అక్రమంగా ఎగుమతి చేశారు. ఈ భూమిలో దొరికిన వాటిల్లో జురాసిక్ కాలం నాటి ఎముకలు, శిలాజాలు.. ఇతర శిలాయుగానికి చెందినవి ఉన్నాయి.
A federal grand jury indicted four people for allegedly stealing and selling more than 150,000 pounds of paleontological resources in the most significant violation of the Paleontological Resources Preservation Act; more than $1 million in fossilized materials sold. (link in bio) pic.twitter.com/DSpjlEhZEC
— Bureau of Land Management Utah (@BLMUtah) October 19, 2023
సాల్ట్ లేక్ సిటీలోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ వారు నలుగురిపై $1 మిలియన్ కంటే ఎక్కువ విలువైన పురాతన వనరులను కొనుగోలు చేసి విక్రయించినట్లు అభియోగాలు మోపారు. వారి నుంచి 1.5 లక్షల పౌండ్ల విలువైన పురాతన శిలాజాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో డైనోసార్ ఎముకలు కూడా ఉన్నాయి, ఇవి ఆగ్నేయ ఉటా నుండి అక్రమంగా సేకరించినట్లు వెల్లడించారు.
పాలియోంటాలాజికల్ రిసోర్సెస్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం పురావస్తు వనరులు అంటే శిలాజ అవశేషాలు, భూమిపై ఉన్న సంరక్షించబడిన జీవుల జాడలు లేదా ముద్రలు పురావస్తు ప్రాముఖ్యతతో పాటు భూమిపై జీవిత చరిత్ర గురించి సమాచారాన్ని అందిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..