Elderly Woman: అమ్మో ఇంజక్షన్.. బామ్మకు టీకా ఇచ్చేందుకు అష్టకష్టాలు.. అప్పుడేమైందో తెలుసా? వైరల్ వీడియో
Injection to an Elderly Woman: డాక్టర్ పేరు వినగానే.. చాలా మందికి భయం మొదలవుతుంది. ఎక్కడ ఇంక్షన్ వేస్తారో.. అంటూ చాలామంది వణుకుతుంటారు. ఇక చిన్న పిల్లల
Injection to an Elderly Woman: డాక్టర్ పేరు వినగానే.. చాలా మందికి భయం మొదలవుతుంది. ఎక్కడ ఇంక్షన్ వేస్తారో.. అంటూ చాలామంది వణుకుతుంటారు. ఇక చిన్న పిల్లల గురించి అయితే మనం చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే.. డాక్టర్ అని శబ్ధం వస్తే చాలు వారంతా.. ఇంట్లోకెళ్లి మరి దాక్కుంటారు. ఎందుకంటే ఇంజక్షన్‌తో తీవ్రమైన నొప్పి వస్తుంది.. కావున వారంతా భయంతో ఏడుస్తుంటారు. అయితే.. పెద్ద వాళ్లు కూడా కొంతమంది ఇంజక్షన్ అనగానే పిల్లల్లాగా ఏడుపు ప్రారంభిస్తారు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ బామ్మకు ఇంజక్షన్ ఇస్తున్నారు. ఈ సమయంలో.. బామ్మ హావాభావాలను.. ప్రతి చర్యను చూసి నెటిజన్లంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఈ వీడియో చిత్రీకరించినట్లు సమాచారం.
ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతుంది. ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు బామ్మ కేకలు వేస్తుంది. ఆ తర్వాత ఇంజక్షన్ ఇచ్చిన వారిని ఏదో అంటుంది. అయితే ఈ ఇంజెక్షన్ ఇచ్చేందుకు ఆమెను ఇద్దరు వ్యక్తులు గట్టిగా పట్టుకోగా.. మూడవ వ్యక్తి ఇంజెక్షన్ ఇస్తున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తుంది. కాగా.. ఈ వీడియో చూసిన వారంతా తెగ నవ్వుతున్నారు. ఇంజక్షన్ అంటే భయం లేని వారేవరంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వృద్ధురాలి హావాభావాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందుకే.. చాలామంది ఈ వీడియోను షేర్ కూడా చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 23 లక్షలకుపైగా నెటిజన్లు వీక్షించారు. మీరు కూడా వీక్షించి ఎంజాయ్ చేయండి.
ఇన్‌స్టా బాలీవుడ్ చేసిన వీడియో..
View this post on Instagram
Also Read: