EV’s Firing: అగ్నికి ఆహుతైన 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కారణాలు కనుక్కునే బాధ్యతను ఆ IITకి అప్పగింత..
EV's Firing: పెట్రోలు ధరల నుంచి ఉపసమనం పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాలనవైపు అనేక మంది మెుగ్గుచూపుతున్నారు. దీనికి తోడు కేంద్రం కూడా ఎలక్ట్రిక్ వానాలను వినియోగించే వారికి ప్రోత్సాహకాలను అందిస్తోంది. కానీ తాజాగా మరో దుర్ఘటన చోటుచేసుకుంది.
EV’s Firing: పెట్రోలు ధరల నుంచి ఉపసమనం పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాలనవైపు అనేక మంది మెుగ్గుచూపుతున్నారు. దీనికి తోడు కేంద్రం కూడా ఎలక్ట్రిక్ వానాలను వినియోగించే వారికి ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఈ తరుణంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఊహించని విధంగా వాహనాల్లో మంటలు రావటం, ఉన్నట్లుండి మంటలకు ఆహుతి కావటం అందరినీ ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తోంది. మార్చి మధ్య నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా కాలిపోతున్న ఉదంతాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్‌లో జితేంద్ర ఈవీ కంపెనీకి చెందిన 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు 11-04-2022 మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. ఫ్యాక్టరీ నుంచి స్కూటర్లను రవాణా చేస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వరుసగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అగ్నికి ఆహుతి అవుతూ ప్రమాదకరంగా మారటంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఏ కారణం చేత ఇలా వాహనాలు ఇలా కాలిపోతున్నయో విచారణ జరపాల్సిందిగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరుకు ఆదేశాలు జారీ చేసింది. అంతకంటే ముందే పూనేలో ఓలా స్కూటర్ కాలిపోయిన ఘటనపై కేంద్రం స్పందించింది. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో వివరణ కూడా ఇచ్చారు.
ఉన్నట్టుండి ఈవీ స్కూటర్లు ఎందుకు మంటల్లో చిక్కుకుంటున్నాయో కనిపెట్టాలంటూ సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీని కేంద్రం ఆదేశించింది. ఈ విచారణ కొనసాగుతుండగానే.. భారీ సంఖ్యలో 20 వాహనాలు ప్రమాదానికి గురికావటంపై కేంద్రం విచారణ బాధ్యతలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు అప్పగించింది. దేశంలో ఈవీ వెహికల్స్ మార్కెట్ పుంజుకుంటోంది. 2020-21 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,34,821 ఈవీలు అమ్ముడవగా.. 2021-22 ఏడాదిలో 4,29,417 ఈవీ అమ్మకాలు జరిగాయి. ఈవీలు ప్రజాదరణ పొందుతున్న తరుణంలో వరుస ప్రమాదాలు జరగటం వాటి భద్రతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. వినియోగదారుల్లో అనేక అనుమానాలను కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో 20 ఈవీలు కంటైనర్ లో తరలిస్తుండగా కాలిపోవటం అతిపెద్ద ప్రమాదంగా నిలిచింది.
One of the worst ever fire accident occurred in Nashik where 20 Electric vehicles gutted fire in Jithendra EV factory. This hazardous catastrophic event happened in India.#Nashik #EV #ElectricVehicles @elonmusk #Tesla pic.twitter.com/K14tulU79C
— Immanuel S (@IMMANUEL_0333) April 11, 2022
ఇవీ చదవండి..
Bank Alert: ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఇన్ని నష్టాలా.. వెంటనే జాగ్రత్త పడండి..
Gold News: సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు .. దేశంలో బంగారాన్ని ఎక్కువగా కొంటోంది వారే..