Time Slot For Vaccine: వ్యాక్సిన్ పంపిణీకి హైదరాబాద్‌లో కొత్త విధానం.. సమయానికి వెళ్లేలా ఏర్పాటు..
Time Slot For Vaccine In HYD: కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో వ్యాక్సిన్ రూపకల్పనకు దేశాలన్నీ తీవ్ర కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే..

Time Slot For Vaccine In HYD: కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో వ్యాక్సిన్ రూపకల్పనకు దేశాలన్నీ తీవ్ర కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వ్యాక్సిన్లకు అనుమతులు కూడా లభించాయి. తాజాగా భారతదేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లను అత్యవసరవినియోగానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా హైదరాబాద్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చే జనాలు కేంద్రాల వద్ద గుమిగూడకుండా సరికొత్త పద్ధతిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం అధికారులు టైమ్ స్లాట్ కేటాయించనున్నారు. ఇందులో భాగంగా టీకా వేసుకోవాలనుకునే వారి నివాస స్థలానికి దగ్గరలో ఉన్న టీకా కేంద్రంలోనే వ్యాక్సినేషన్‌కు అనుమతివ్వనున్నారు. ఈ క్రమంలో వారి నివాస స్థలానికి సంబంధించిన పిన్‌కోడ్, టీకా కేంద్రం కోడ్, చిరునామాతో పాటు టీకా వేసే తేదీ, సమయంతో కూడిన స్లాట్ వివరాలను మెసేజ్ రూపంలో పంపించనున్నారు. మెసేజ్ వచ్చిన వారు అందులో పేర్కొన్న నిర్ణీత తేదీ, సమయానికి టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.