Salman Khan: ఈ ఈద్‌కి మీ సినిమా థియేటర్స్‌కు తీసుకురండి… సల్లూ భాయ్‌ని కోరిన ఎగ్జిబిటర్స్…

ఈ ఈద్‌కి మీ సినిమాను థియేటర్స్‌కు తీసుకురండి భాయ్‌ అని ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ సల్మాన్‌ని కోరింది. సల్లూ...

Salman Khan: ఈ ఈద్‌కి మీ సినిమా థియేటర్స్‌కు తీసుకురండి... సల్లూ భాయ్‌ని కోరిన ఎగ్జిబిటర్స్...
Follow us

| Edited By:

Updated on: Jan 04, 2021 | 7:59 AM

ఈ ఈద్‌కి మీ సినిమాను థియేటర్స్‌కు తీసుకురండి భాయ్‌ అని ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ సల్మాన్‌ని కోరింది. సల్లూ భాయ్ నటిస్తున్న రాధే రైట్స్ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందన్న నేపథ్యంలో ‘రాధే’ను థియేటర్స్‌లోనే విడుదల చేయమంటూ అసోసియేషన్ ఓ లేఖ ద్వారా కోరింది. ఇలాంటి కష్టసమయంలో థియేటర్స్‌ బిజినెస్‌కు సహాయంగా నిలబడాలని కోరారు.

సల్మాన్‌ చిత్రం అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉంటాయని, ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్‌కి తీసుకొచ్చే స్టామినా ఉన్న స్టార్‌ సల్మాన్‌ అసోసియేషన్ తెలిపింది. కాగా, తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఇప్పటికే థియేటర్లను సగం సామర్థ్యంతో నడిపిస్తున్నారు. అయితే హిందీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంతవరకు థియేటర్ల విషయంలో ఎటువంటి స్పష్టత రాలేదు. అందుకే ఏదైనా పెద్ద సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారని ఎగ్జిబిటర్స్ వాదిస్తున్నారు. ఏదీ ఏమైనా సల్మాన్ ఖాన్ సినిమా థియేటర్లలోకి వస్తుందో..? లేక ఓటీటీ వేదికగా రిలైజ్ అవుతుందో చూద్దాం..?

Also Read: 

sam jam show : సమంత షోలో నాగచైతన్య.. భర్త తో కలిసి సందడి చేయనున్న అక్కినేని కోడలు పిల్ల

Pawan Kalyan: కొత్త ఏడాది కథ వేరే ఉంటది.. అభిమానులకు సిగ్నల్స్ పంపిన పవర్ స్టార్..!