ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పులి సంచారం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. కొన్ని రోజులుగా పులి సంచరిస్తూ తమ కంటపడినట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగుడాలో పులి పులి సంచరించింది. ఓపీసీ విధులకు వెళ్తున్న డ్రైవర్లకు డిబిఎల్ ఓపెన్ కాస్ట్ పరిసర ప్రాంతంలో పులి ఆడవిలోంచి రోడ్డుపైక వస్తూ కనిపించింది. భయంతో సిబ్బంది పరుగులు తీశారు. ఒకరు తన మొబైల్ ఫోన్ లో పులి చిత్రాలను బంధించారు. దీంతో స్థానికులు […]

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. కొన్ని రోజులుగా పులి సంచరిస్తూ తమ కంటపడినట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగుడాలో పులి పులి సంచరించింది. ఓపీసీ విధులకు వెళ్తున్న డ్రైవర్లకు డిబిఎల్ ఓపెన్ కాస్ట్ పరిసర ప్రాంతంలో పులి ఆడవిలోంచి రోడ్డుపైక వస్తూ కనిపించింది. భయంతో సిబ్బంది పరుగులు తీశారు. ఒకరు తన మొబైల్ ఫోన్ లో పులి చిత్రాలను బంధించారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతనెల రోజుల వ్యవధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూర్, పెంచికల్‌పేట అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపించాయి. తాజాగా పులి కనిపించడంతో స్థానికులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులెవ్వరూ భయాందోళనకు గురికావద్దని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.