జహీరాబాద్‌ చెరకు రైతన్నలకు కడుపు మండింది. పండించిన పంటను కొనుగోలు చేసేది ఎవరంటూ..

జహీరాబాద్‌ చెరుకు రైతులు రోడ్డెక్కారు. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జహీరాబాద్‌ చెరకు రైతన్నలకు కడుపు మండింది. పండించిన పంటను కొనుగోలు చేసేది ఎవరంటూ..
Zaheerabad Sugarcane Farmer

Updated on: Sep 04, 2021 | 1:18 PM

Sugarcane Farmers: జహీరాబాద్‌ చెరుకు రైతులు రోడ్డెక్కారు. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి పరిశ్రమ ఓపెన్ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, జహీరాబాద్‌లో ఎక్కువ మంది రైతులు చెరకు పండిస్తుంటారు.

ఈసారి 15 వేలకు పైగా ఎకరాల్లో పంట సాగుచేయగా 7 నుంచి 8 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మే, జూన్‌ నెలలో క్రషింగ్ చేయాల్సి ఉంది. ట్రైడెంట్‌ షుగర్ పరిశ్రమ యాజమాన్యం రెండేళ్లుగా క్రష్షింగ్ చేపట్టకపోవడంతో రైతుకు పెద్ద తలనొప్పిగా మారింది.

తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో చెరకు సాగుచేసే ప్రాంతంగా జహీరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అటు ప్రభుత్వం, ఇటు ట్రైడెంట్‌ యాజమాన్యం తీరుతో రెండేళ్లుగా క్రష్షింగ్ సమస్య వెంటాడుతోంది. గత ఏడాది పంటను పక్క రాష్ట్రం కర్ణాటక తీసుకెళ్లా అమ్ముకోవాల్సి వచ్చింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్తున్న ప్రభుత్వం.. ఉన్న పరిశ్రమలు మూత పడుతున్నా పట్టించుకేవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్లుగా ఓపెన్ కానీ ట్రైడెంట్ పరిశ్రమలో ప్రస్తుతం సిబ్బంది కూడా అందుబాటులో లేరు. ఈ సారి కూడా ఈ కంపెనీ ఓపెన్ కాకపోతే ఇక్కడ పండించిన చెరుకును మళ్లీ పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లాలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అలా చేస్తే తాము పండించినా లాభం ఉండదని అంటున్నారు రైతులు.

Read also:Variety Village: అదో వెరైటీ ఊరు. నడవడికలోనే కాదు, ఆఖరికి పెళ్లిళ్ల విషయంలో కూడా విచిత్ర కట్టుబాట్లు