YS Sharmila: తెలంగాణలో పొలిటికల్ హీట్.. రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదలైన రాజకీయ యుద్ధం క్రమంగా భాగ్యనగరానికి వ్యాపించి అల్లకల్లోలంగా మార్చింది. అరెస్టు అనంతరం బెయిలపై వచ్చిన YSRTP అధ్యక్షురాలు షర్మిల టీఆర్ఎస్‌ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila: తెలంగాణలో పొలిటికల్ హీట్.. రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల..
YS Sharmila

Edited By:

Updated on: Nov 30, 2022 | 10:38 PM

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదలైన రాజకీయ యుద్ధం క్రమంగా భాగ్యనగరానికి వ్యాపించి అల్లకల్లోలంగా మార్చింది. అరెస్టు అనంతరం బెయిలపై వచ్చిన YSRTP అధ్యక్షురాలు షర్మిల టీఆర్ఎస్‌ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదంటూ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి. ఈ పొలిటికల్ టెన్షన్ రేపు రాజ్‌భవన్‌కు చేరుకోనుంది. వైఎస్ షర్మిల గురువారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ను కలవనున్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లనున్న వైఎస్‌ షర్మిల.. గవర్నర్‌ను కలిసి తనపై దాడి, అరెస్టు తదితర వివరాల గురించి ఫిర్యాదు చేయనున్నారు.

ఇదిలాఉంటే.. షర్మిలను అరెస్ట్‌ చేసిన తీరును గవర్నర్‌ తమిళిసై ఇప్పటికే తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు, ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయంటూ ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై బీజేపీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. షర్మిల అరెస్టు తీరు బాధకలిగించిందని ఆందోళన వ్యక్తంచేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..