YS Sharmila Supports Minister KTR: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై.. తిన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్విట్ చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా..? అంటూ తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై కేటీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దంటూ మంత్రి కోరారు. కాగా.. దీనిపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.
As a mother I detest bullying kids&as a leader of a political party,I condemn such derogatory statements on the family members.Whether it is belittling women or bodyshaming kids, we must come together to call out such statements irrespective of our political affiliations @KTRTRS https://t.co/6L16jNYtcL
— YS Sharmila (@realyssharmila) December 25, 2021
Also Read: