YS Sharmila: ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల.. నిరుద్యోగ నిరాహార దీక్ష

YS Sharmila: దేశంలో అత్యధిక నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. నల్గొండ..

YS Sharmila: ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల.. నిరుద్యోగ నిరాహార దీక్ష
Follow us

|

Updated on: Jul 27, 2021 | 10:47 PM

YS Sharmila: దేశంలో అత్యధిక నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. నల్గొండ జిల్లా చుండూరు మండలం పుల్లెంలలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్‌ (26) కుటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు. అనంతరం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి ఎన్నో పథకాలను వైఎస్సార్‌ నాడు ప్రవేశపెట్టారని, తెలంగాణలో ఎవరిని కదిలించినా అప్పులేనని, తెలంగాణలో ప్రతి కుటుంబం అప్పులపాలైందని ఆరోపించారు. ఇళ్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, వైఎస్ఆర్ పాలనలో తెలంగాణలో సంక్షేమం కనిపిస్తే, ఇప్పుడు సంక్షోభం కనిపిస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాల్సిందేనని అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఒక్కరికైనా ఇచ్చారా ? అని షర్మిల ప్రశ్నించారు.

ఇవీ కూడా చదవండి

ఈనెల 31లోపు పూర్తి చేయండి.. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌

MLA Shankar Naik: అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం.. ఏకంగా పోడు భూముల వద్ద కాపాలాగా..