AP-TS Water Disputes: జగన్ vs షర్మిల.. ఏపీ, తెలంగాణ జల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల..

|

Jun 28, 2021 | 5:37 PM

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు..

AP-TS Water Disputes: జగన్ vs షర్మిల.. ఏపీ, తెలంగాణ జల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల..
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. ఫిల్మ్‌ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే 'వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ'గా పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Follow us on

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని కుండబద్దలు కొట్టారు. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడటానికి తాము సిద్ధం అని ప్రకటించారు. సోమవారం నాడు.. జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘చాలా మంది అనుకోవచ్చు. ఈమె తెలంగాణ కోసం నిలబడుతుందా? ఈమె తెలంగాణ కోసం పోరాడుతుందా? తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టులను అడ్డుకుంటుందా? అని సందేహపడొచ్చు. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నాను. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోబోము. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టును అయినా.. ఏ పనిని అయినా నేను అడ్డుకుంటా. తెలంగాణ ప్రజల కోసం నిలబడతా.. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతా..’ అని వైఎస్ షర్మిల ఉద్ఘాటించి చెప్పారు.

Twitter Video:

Also read:

Twitter shows Kashmir-Ladakh: మరోసారి హద్దుమీరిన ట్విట్టర్.. పాక్ అంతర్భాగంగా కశ్మీర్‌, మరో దేశంగా లద్దాఖ్‌.. ట్విటర్‌పై కేంద్రం సీరియస్!

మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పువ్వాడ.. రూ.35 లక్షల చెక్కులు, ఉద్యోగ నియామక పత్రం అందజేత..

Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్ 22 ఏళ్లు పూర్తి; టెండూల్కర్ రికార్డుకు ఎసరు?