YS Sharmila: వైఎస్‌ షర్మిల అరెస్ట్‌.. స్టేషన్ లోనే దీక్ష కొనసాగిస్తోన్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు..

|

Feb 15, 2022 | 3:00 PM

Telangana: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు

YS Sharmila: వైఎస్‌ షర్మిల అరెస్ట్‌.. స్టేషన్ లోనే దీక్ష కొనసాగిస్తోన్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు..
Follow us on

Telangana: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఆందోళనతో భారీగా ట్రాఫిక్‌ జామ్ కావడంతో అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆమె స్టేషన్‌లోనూ తన ధర్నానుకొనసాగిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రంలో 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్లు విడుదల చేయాలంటూ కార్యకర్తలతో కలసి నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు.

నిరుద్యోగులకు సంఘీభావంగా..

కాగా నిరుద్యోగులకు మద్దతుగా సాయంత్రం వరకు నిరసన దీక్ష చేస్తానని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందే కార్యకర్తలతో కలిసి బైఠాయించారు షర్మిల. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనేపోలీసులు అక్కడికి చేరుకొని షర్మిలతో పాటు పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆమె స్టేషన్‌ లోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు. ‘నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ లో చలనం రావడం లేదు. నిరుద్యోగులకు ఆదుకోని ముఖ్యమంత్రి మనకెందుకు?’ అని ఆమె ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:Windows 11: విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుతున్నారా.? అయితే ఈ అప్‌డేట్‌ మీకోసమే..

Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ సేవలకు రేపటి నుంచి టికెట్లు కేటాయింపు..

Bjp vs Trs: సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. సవాల్‌కు సిద్ధమంటూ.. లైవ్ వీడియో