Agnipath Protest: అగ్నిపథ్ కేసుల భయానికి యువకుడి ఆత్మహత్య.. గోదావరి నదిలో దూకి..

|

Aug 12, 2022 | 11:28 AM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో నిందితులపై రైల్వే యాక్ట్ తో పాటు 26 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే అగ్నిపథ్‌ కేసులకు భయపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Agnipath Protest: అగ్నిపథ్ కేసుల భయానికి యువకుడి ఆత్మహత్య..  గోదావరి నదిలో దూకి..
Agnipath Scheme Case
Follow us on

Agnipath scheme protests: ఎవరో ఎదో చెప్పారని.. భవిష్యత్ లో జరిగే పరిణామాలను అంచనా వేయకుండా యువత తీసుకునే నిర్ణయాలు.. పనులకు పర్యవసానం ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేసింది.. అగ్నిపథ్‌ పథకంపై చేపట్టిన ఆందోళనలు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) వేదికగా చేపట్టిన ఆందోళన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఈ విధ్వంసంలో సుబ్బారావు ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. అతనితో పాటు ముగ్గురు ప్రధాన అనుచరులను అరెస్ట్ చేశారు. నిందితులపై రైల్వే యాక్ట్ తో పాటు 26 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే అగ్నిపథ్‌ కేసులకు భయపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని తానూర్ మండలం బేల్ తరోడా గ్రామానికి చెందిన పర్ధ్యా మహేష్ ( 24 ) బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్‌ పై  సికింద్రాబాద్‌ అల్లర్ల ఘటనకు సంబంధించిన కేసు నమోదైంది. మహేష్ ఇలా అఘాయిత్యానికి పాల్పడానికి కారణం.. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం అంటూ కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరోవైపు ఈ అల్లర్లలో పాల్గొన్న ఏ ఒక్క యువతని ఆర్మీ రిక్యుట్ మెంట్ సమయంలో పరిగణలోకి తీసుకోమని ఇప్పటికే ఆర్మీ అధికారులు తేల్చి చెప్పారు. నియామక సమయంలో పోలీస్ ఎంక్వైరీ ఉంటుందని.. అభ్యర్థులు బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ ఉంటుందని తేల్చి చెప్పేశారు.. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో  నిందితుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్షమించమని ప్రభుతాన్ని వేడుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..