Love: ప్రేమా.. ప్రేమా అంటూ వెంట తిరిగాడు.. పెళ్లి అనే సరికి పరారయ్యాడు.. మరి ప్రియురాలు ఏం చేసిందంటే..!

|

Dec 27, 2021 | 7:18 PM

Love Cheating: కాలేజీలో కలిశారు. మాటలు కలిశాయి. మనుసులు ఒకటయ్యాయి. ఇంకేముందు ప్రేమంటూ ఏడేళ్లు హాయిగా తిరిగారు. అయితే, ఆ తరువాతే అసలు కథ మొదలైంది.

Love: ప్రేమా.. ప్రేమా అంటూ వెంట తిరిగాడు.. పెళ్లి అనే సరికి పరారయ్యాడు.. మరి ప్రియురాలు ఏం చేసిందంటే..!
Love Cheating
Follow us on

Love Cheating: కాలేజీలో కలిశారు. మాటలు కలిశాయి. మనుసులు ఒకటయ్యాయి. ఇంకేముందు ప్రేమంటూ ఏడేళ్లు హాయిగా తిరిగారు. అయితే, ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ప్రేయసి పెళ్లి అనేసరికి మొఖం చాటేశాడు ప్రేమికుడు. దాంతో న్యాయం చేయాలంటూ ప్రియురాలు తన ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. విషయం బట్టబయలు అవడంతో ప్రియుడు సహా అతని కుటుంబ సభ్యులు బిస్తర్ సర్దుకుని పారిపోయారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలో జరిగింది.

వివరాల్లోకెళితే.. మందపెళ్లి గ్రామానికి చెందిన పర్షా వెంకటేశ్‌ జూనియర్‌ కాలేజీలో చదువుతుండగా.. కుబీర్‌ గ్రామానికి చెందిన యువతితో మాటలు కలిపాడు. కొద్ది రోజుల తర్వాత ప్రేమంటూ ఆమె వెంట తిరిగాడు. మధ్యలో గల్ఫ్‌ వెళ్లిన వెంకటేశ్‌.. ఊరికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. తీరా గల్ఫ్‌ నుంచి తిరిగొచ్చిన వెంకటేశ్‌.. మరో యువతితో పెళ్లి నిశ్చయించుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు నెలల పాటు జైల్‌కు కూడా వెళ్లి వచ్చినా.. మనోడి తీరులో మార్పు రాలేదు. తన మేనమామ కూతురిని పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం తెలుసుకొని వెంటకేశ్‌ ఇంటి ముందు ధర్నాకు దిగింది బాధిత యువతి. అయితే, యువతి ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న ఫ్యామిలీ మొత్తం ఇంటికి తాళంవేసి పరారయింది. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడితో పాటు.. అతని ఫ్యామిలీ కోసం గాలిస్తున్నారు.

 Also read:

Telangana TSSPDCL Slab: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మోత తప్పదా?.. యూనిట్‌కు ఎంత మేర పెరగనుందంటే..!

Viral Video: గేటు దూకి పెంపుడు కుక్కను నోటకరుచుకుని ఎత్తుకెళ్లిన చిరుత‌.. చూస్తే వణుకు పుట్టాల్సిందే!

Dil Raju: సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తాం.. టికెట్ ధర మాత్రమే కాదు.. అనేక సమస్యలున్నాయన్న నిర్మాత దిల్ రాజు..