మహిళలపై అత్యాచారాలు (Rape), దాడులు నిత్యకృత్యమయ్యాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఏదో ఒక చోట దురాగతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి నిండు జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు. తాజాగా కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆర్థిక లావాదేవీల కారణాలతో మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. అంతే కాకుండా ఆమెను తీవ్రంగా కొట్టి, నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు సదరు మహిళను ఆస్పత్రికి తరలించి, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. బీబీపేట్(Bibipeta) కు చెందిన ఓ మహిళ వద్ద జనగామ గ్రామానికి చెందిన గణేశ్ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. డబ్బు తీసుకుని చాలా కాలం కావడంతో అప్పు తీర్చాలని మహిల గణేశ్ ను అడిగింది. ఈ క్రమంలో అప్పు తీరుస్తానని చెప్పి.. మహిళను గణేశ్ తన బైక్ పై గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు.
ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి అత్యాచారం చేశాడు. అంతే కాకుండా శిరీష వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, రూ.500 నగదును లాక్కుని పరారయ్యాడు. అతికష్టం మీద ఇంటికి చేరుకున్న బాధితురాలు.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపారు. వెంటనే అప్రమత్తమైన వారు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితురాలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.
Multibagger Returns: ఏడాదిలో పెట్టుబడిని రెండింతలు చేసిన రియల్ ఎస్టేట్ మల్టీబ్యాగర్ స్టాక్..