సెల్ ఫోన్ లు ఎంత ఉపయోగకరమో, అంతకన్నా ఎక్కువ ప్రమాదకరమని ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. స్నాప్ చాట్(Snap Chat) యాప్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న యువకుడు.. ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. నిత్యం ఆమెతో మాట్లాడుతూ దగ్గరయ్యాడు. అతని మాయమాటలు నమ్మిన బాలిక.. అతనితో కలిసి హోటల్ రూంకు వెళ్లింది. అక్కడ ఆ యువకుడు బాలికపై అత్యాచారానికి(Rape) పాల్పడ్డాడు. దీనికి మరో ఇద్దరు వ్యక్తులు సహకరించడం గమనార్హం. అతని చెర నుంచి తప్పించుకున్న బాలిక.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్(Hyderabad) లోని మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన ఆమన్ ఖాన్.. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి స్నాప్ చాట్ ద్వారా కార్ఖానాకు చెందిన ఓ బాలిక పరిచయమైంది. ఇద్దరూ తరుచూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.
ఈ క్రమంలో నిన్ను ప్రేమిస్తున్నానని అమర్ ఖాన్ బాలికను నమ్మించాడు. ఆమెకు మాయమాటలు చెప్పి హైదరాబాద్‌లో రూంలు అద్దెకు తీసుకున్నాడు. ఇతనికి హోటళ్లలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు సహకరించారు. అనంతరం బాలికపై అమన్ ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
అతని చెర నుంచి తప్పించుకున్న బాలిక.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే అప్రమత్తమై ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఆమన్ ఖాన్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Also Read
Weight Loss: వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా? అయితే, కారణమిదే..