Telangana: కళ్ళముందే కొడుకు గోదావరిలో గల్లంతవుతుంటే తల్లడిల్లిన తల్లిదండ్రులు..!

కాలేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరిలో గల్లంతైన యువకుని మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులతో కలిసి పుణ్యస్థనానికి వచ్చిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్ళముందే కొడుకు గోదావరిలో గల్లంతై ప్రాణాలు కోల్పోగా కన్నవారు కన్నీరుమున్నీరుగా వినిపిస్తున్నారు.

Telangana: కళ్ళముందే కొడుకు గోదావరిలో గల్లంతవుతుంటే తల్లడిల్లిన తల్లిదండ్రులు..!
Kaleshwaram
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 17, 2024 | 7:56 AM

కాలేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరిలో గల్లంతైన యువకుని మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులతో కలిసి పుణ్యస్థనానికి వచ్చిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్ళముందే కొడుకు గోదావరిలో గల్లంతై ప్రాణాలు కోల్పోగా కన్నవారు కన్నీరుమున్నీరుగా వినిపిస్తున్నారు.ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వర త్రివేణి సంగమం గోదావరి నదిలో జరిగింది..

వరంగల్ లోని లేబర్ కాలనీకి చెందిన గరికపాటి ప్రవీణ్ – రజిని దంపతుల కుమారుడు అఖిల్ కుటుంబసభ్యులతో కలిసి కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలోనే గోదావరిలో పుణ్యస్థానాలు చేస్తుండగా అఖిల్ గల్లంతయ్యాడు. తన కొడుకు గోదావరిలో మునిగిపోతుండగా చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు స్థానికులకు సమాచారం అందించారు. అక్కడ ఉన్న జాలర్లు వెంటనే రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు జాలర్లు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అఖిల్ ను ప్రాణాలతో కాపాడలేక పోయారు.

అయితే ఆదివారం జరిగిన ఘటనలో సోమవారం రోజు ఉదయం అఖిల్ మృతదేహం లభ్యమైంది. పుణ్య స్నానానికి వచ్చి విగత జీవిగా మారిన కన్న బిడ్డను ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చేతికందిన కొడుకు ఆ కుటుంబసభ్యుల్లో తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..