TG Civil Assistant Surgeon Posts: తెలంగాణ వైద్యశాఖలో 755 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయించింది. ఈమేరకు త్వరలో వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. 531 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌), 193 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 31 స్టాఫ్‌ నర్సు పోస్టులకు తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) త్వరలో ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది..

TG Civil Assistant Surgeon Posts: తెలంగాణ వైద్యశాఖలో 755 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌
TG Civil Assistant Surgeon Posts
Follow us

|

Updated on: Jun 17, 2024 | 8:27 AM

హైదరాబాద్‌, జూన్‌ 17: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయించింది. ఈమేరకు త్వరలో వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. 531 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌), 193 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 31 స్టాఫ్‌ నర్సు పోస్టులకు తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) త్వరలో ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్‌ సర్కార్ వివిధ ఆస్పత్రులు, విభాగాల్లో ఖాళీలను గుర్తించి వెంటనే భర్తీచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దీనిలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల కొరత ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. అన్ని ఆస్పత్రుల్లో ఎక్కడెక్కడ ఖాళీ పోస్టులున్నాయో ఆ వివరాలు తీసుకున్న వైద్యఆరోగ్యశాఖ మొత్తం 531 పోస్టులను గుర్తించింది. ఈ పోస్టులను వెంటనే భర్తీచేసేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. వైద్యుల పోస్టులతో పాటు 193 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 31 స్టాఫ్‌నర్సుల పోస్టులకు కూడా వేరువేరుగా ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

జూన్‌ 19 నుంచి ఐటీఐల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ జూన్‌ 19 నుంచి ప్రభుత్వ పాత ఐటీఐలో జరగనున్నట్లు కంచరపాలెం ప్రిన్సిపల్‌ జె శ్రీకాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఇటీవల ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కూడా స్వీకరించింది. మొత్తం 3398 మంది అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలించారు. వీరంతా ర్యాంక్‌ల వారీగా కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఆయన తెలిపారు. కౌన్సెలింగ్‌ సమయంలో అన్ని ఒరిజనల్‌ పత్రాల్నీ తమ వెంట తీసుకురావాలని ఆయన అన్నారు. జూన్‌ 26 వరకు కౌన్సెలింగ్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.