ఏసీబీ అధికారులు పింక్ అండ్ వైట్ కలర్ బాటిల్స్‌ను నిందితుల ముందు ఎందుకు ఉంచుతారు..?

| Edited By: Balaraju Goud

Sep 28, 2024 | 4:26 PM

అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరప్షన్ బ్యూరో) అవినీతికి పాల్పడే వ్యక్తులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేచ్చేటువంటి పదం..! లంచం తీసుకునే వారు ఎక్కడ ఉంటే బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు అక్కడికి నిమిషాల్లో వాలిపోతారు.

ఏసీబీ అధికారులు పింక్ అండ్ వైట్ కలర్ బాటిల్స్‌ను నిందితుల ముందు ఎందుకు ఉంచుతారు..?
Acb Acb Pink And White Bottle
Follow us on

అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరప్షన్ బ్యూరో) అవినీతికి పాల్పడే వ్యక్తులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేచ్చేటువంటి పదం..! లంచం తీసుకునే వారు ఎక్కడ ఉంటే బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు అక్కడికి నిమిషాల్లో వాలిపోతారు. అనంతరం బాధితులు డబ్బులను లంచగొండి చేతులలో పెడతారు. అంతలోనే జెట్ స్పీడ్‌లో ఏసీబీ అధికారులు వారిని ట్రాప్ చేసేస్తారు.. ఇంతకీ అంత త్వరగా ఎలా ట్రాప్ చేస్తారు..? ట్రాప్ చేసిన తర్వాత అక్కడ డబ్బులతో పాటు ఒక పింక్ కలర్, వైట్ కలర్ బాటిల్స్ నిందితుల ముందు ఉంచుతారు. ఇంతకీ ఆ పింక్, వైట్ కలర్ బాటిల్స్ ఎందుకు ఉంచుతారో తెలుసా..?

ఏసీబీ అధికారులు బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ అధికారిని ట్రాప్ లో దించేందుకు సిద్ధమవుతారు. తొలుత సదరు బాధితుడు తన సమస్య కోసం ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తాడు. తనకున్న సమస్యను బట్టి అవినీతి అధికారి కొంతమంది లంచం డిమాండ్ చేస్తాడు. అప్పటికీ ఆ బాధితుడు అధికారి అడిగిన డబ్బులను ఇస్తాడు. అయినప్పటికీ ఇంకా లంచం కావాలని అడగడంతో, చేసేదేమీ లేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తారు. ఆ లంచానికి సంబంధించిన డబ్బులను ఆ బాధితుడు ఏసీబీ అధికారులకు ఇవ్వగా ఆ డబ్బులు పై ఉన్న నెంబర్లను, ఆ కరెన్సీ నోట్లకు ఫినాఫ్తలిన్ అనే ఒక పౌడర్ ను రాస్తారు. అంతేకాకుండా ఆ పౌడర్‌ను బాధితుడి వద్ద కూడా ఉంచుతారు. ఈ ఫినాప్తెలిన్ పౌడర్ కేవలం ఏసీబీ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది.

ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆ తర్వాత ఆ బాధితుడు అదే రోజు ఆ లంచం అడిగిన అధికారి వద్దకు వెళ్తాడు. వెళ్లిన అనంతరం ఫినాప్తలిన్ పౌడర్ పూసి ఉన్న నోట్ల కట్టను సదరు ప్రభుత్వ అధికారికి ఇస్తాడు. ఇక అంతే దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి ప్రవేశించి వారితో పాటు తెచ్చుకున్న వైట్ కలర్ కార్బోహైడ్రేట్ అనే లిక్విడ్ తో డబ్బు తీసుకున్న ఆ ప్రభుత్వ అధికారి చేతులను కడుగుతారు. ఇలా కడిగిన తర్వాత పింక్ కలర్ లోకి వస్తే అతను ఆ డబ్బును లంచం అడిగినట్లుగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధంగా ఏసీబీ అధికారులు లంచాలకు పాల్పడుతున్న వారిని ట్రాప్ చేస్తారు. ఈ బాటిల్స్‌ను ప్రధాన సాక్ష్యంగా కోర్టులో ఆధారాలుగా కూడా చూపిస్తారు ఏసీబీ అధికారులు. తాజాగా విక్టోరియా మెమోరియల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్‌ని కూడా ఈ విధంగానే ట్రాప్ చేశారు ఏసీబీ అధికారులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..