Yadadri Temple: యాదాద్రి కొండపైకి ఆ వాహనాలకు నో పర్మిషన్.. కీలక నిర్ణయం తీసుకున్న ఈవో..

|

Mar 31, 2022 | 7:45 PM

లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదాద్రి (Yadadri)లో స్వయంభూ మూర్తుల దర్శనాలు ప్రారంభం కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. దీనికి అనుగుణంగానే సౌకర్యాలు కల్పించేందుకు టీఎస్ఆర్టీసీ (TSRTC) సమాయత్తమవుతోంది

Yadadri Temple: యాదాద్రి కొండపైకి ఆ వాహనాలకు నో పర్మిషన్.. కీలక నిర్ణయం తీసుకున్న ఈవో..
Yadadri Temple
Follow us on

లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదాద్రి (Yadadri)లో స్వయంభూ మూర్తుల దర్శనాలు ప్రారంభం కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. దీనికి అనుగుణంగానే సౌకర్యాలు కల్పించేందుకు యాదాద్రి దేవస్థానం  సమాయత్తమవుతోంది.  కాగా యాదగిరిగుట్టకు భక్తులను చేరవేసేందుకు గాను యాదాద్రి దర్శిని(Yadadri darshini) పేరుతో 100 మినీ బస్సులను టీఎస్ఆర్టీసీ (TSRTC) అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి జిల్లా కేంద్రం నుంచి యాదాద్రి కొండకు ఈ బస్సులు నడవనున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌ సర్కిల్‌ నుంచి కూడా యాదగిరిగుట్టకు మినీ బస్సులు నడవనున్నాయి. కాగా రేపటి నుంచి (ఏప్రిల్‌1) నుంచి యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులను కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. భక్తుల తరలింపునకు అయ్యే పూర్తి ఖర్చును దేవస్థానమే భరిస్తుందని ఈవో స్పష్టం చేశారు. కాగా యాదాద్రి క్షేత్రంలో త్వరలో స్వామి వారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు జోడు సేవలు ప్రారంభిస్తామన్నారు.

కాగా యాదాద్రి స్వామివారి నిత్య కైంకర్యాల స‌మ‌యాల‌ను దేవస్థానం ప్రకటించింది. అవెలా ఉన్నాయంటే..

*ఉదయం 4నుంచి 4.30 వరకు సుప్రభాతం
*ఉదయం 4.30 నుంచి 5 వరకు బిందె తీర్థం, ఆరాధన
*ఉదయం 5 నుంచి 5.30 వరకు బాలభోగం
*ఉదయం 5.30 నుంచి 6 వరకు పుష్పాలంకరణ సేవ
*ఉదయం 6నుంచి 7.30 వరకు సర్వ దర్శనం
*ఉదయం 7.30 నుంచి 8.30 వరకు నిజాభిషేకం
*ఉదయం 8.30 నుంచి 9 వరకు సహస్రనామార్చన
*ఉదయం 9 నుంచి 10 వరకు బ్రేక్ దర్శనం
*ఉదయం 10 నుంచి 11.45 వరకు సర్వదర్శనం
*ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం

Also Read:పేస్ కట్స్ తో సహా గుర్తుపట్టలేనట్టు మారిపోయిన తెలుగు ముద్దుగుమ్మ మీరా జాస్మిన్

RRR movie : కొససాగుతున్న వసూళ్ల వేట.. ఆరు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఎంత వసూల్ చేసిందంటే..

LSG vs CSK, IPL 2022: ఆ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో చెన్నై బౌలర్‌.. మిస్టర్‌ కూల్‌ను ఊరిస్తోన్న మరో రికార్డు.. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్‌..