Jangu Prahlad: గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కన్నుమూత.. సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్..

|

Oct 29, 2021 | 10:25 AM

ప్రముఖ గేయ రచయిత.. తెలంగాణ ఉద్యమకారుడు.. జననాట్య మండలి సీనియర్ కళాకారుడు జంగు ప్రహ్లాద్ కన్నుమూశారు..

Jangu Prahlad: గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కన్నుమూత.. సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్..
Jangu Prahlad
Follow us on

ప్రముఖ గేయ రచయిత.. తెలంగాణ ఉద్యమకారుడు.. జననాట్య మండలి సీనియర్ కళాకారుడు జంగు ప్రహ్లాద్ కన్నుమూశారు.. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.. దీంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ  తుదిశ్వాస విడిచారు.. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురం గ్రామానికి చెందిన జంగు ప్రహ్లాద్.. ఆయనకు ముగ్గురు పిల్లలు..జంగు ప్రహ్లాద్ తన ఆట పాటలతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గోన్నారు..

తెలంగాణ ఉద్యమ గాయకుడు జంగ్ ప్రహ్లాద్ మరణం పట్ల ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం లో గాయకుడిగా ప్రహ్లాద్ చేసిన సాంస్కృతిక కృషిని సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. జంగ్ ప్రహ్లాద్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జంగు ప్రహ్లాద్ మరణవార్త విని జన నాట్య మండలి, కళామతల్లి కళాకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన‌ మృతికి తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ అశృనివాళి అర్పిస్తున్నారు.

Also Read: Varudu Kavalenu Twitter Review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే..

Romantic Twitter Review: అదుర్స్ అనిపించుకుంటున్న ఆకాశ్ పూరీ.. రొమాంటిక్ సినిమా ట్విట్టర్ రివ్యూ..