MLC Goreti Venkanna on Telangana Dalit Bandhu Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తన్న దళిత బంధు పథకంపై ఎమ్మెల్సీ, కవి గోరేటి వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దళిత సమాజం వ్యాపార వర్గం గా అభివృద్ది చెందాలని ‘‘తెలంగాణ దళిత బంధు పథకం’’ ప్రవేశపెడుతోంది సీఎం కేసీఆర్ సర్కార్.. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకునేందుకు వీలు కల్పించింది. దీనిపై స్పందించి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న.. దేశ చరిత్రలో దళిత బంధు పథకం విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందన్నారు. ఉద్యమ స్పూర్తితో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తర్వాత దళితుల గురించి ఆలోచన చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
చిన్న లోన్ కోసం తన్లాడిన దళితులకు పదిలక్షల రూపాయలు దళిత బంధు ద్వారా ఉపాధి కోసం పూర్తి ఉచితంగా ఇవ్వడం.. సీఎం కేసీఆర్మానవీయ నిర్ణయం. సీఎం కేసీఆర్ అందించే ఆర్థిక సాయం ద్వారా, అణచివేతకు గురైన దళిత జాతి అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దళితులు వివక్షను అధిగమించి ఆర్థిక సామాజిక ఆత్మ గౌరవంతో నిలిచినప్పుడే నిజమైన అభివృద్ది అన్న గోరేటి.. దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పుకోసం వచ్చే దిశగా దళితుల ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలులోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం చేస్తున్న చారిత్రక కృషి అన్నారు. తద్వారా తెలంగాణతో పాటు దేశ దళిత సమాజంలో అభివృద్ధి వెలుగులు ప్రసరింప చేసేందుకు దోహదపడాలన్నారు గోరేటి వెంకన్న.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ దళిత బంధు పథకం హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. దళితులను ఆర్థిక వివక్షనుంచే కాకుండా సామాజిక వివక్షనుంచి దూరంచేసి వారి ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టేందుకే తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని సిఎం పునరుద్ఘాటించారు.
Read Also…