Business: హైద‌రాబాద్‌లో మ‌రో ల్యాండ్ మార్క్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌! ఎక్కడంటే..

|

Jun 26, 2022 | 10:08 AM

భారతదేశంలోనే అతిపెద్ద ప్రపంచ వాణిజ్య కేంద్రం హైదరాబాద్‌లో నిర్మించబడుతోంది. నగరానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ శంషాబాద్‌ సమీపంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌..

Business: హైద‌రాబాద్‌లో మ‌రో ల్యాండ్ మార్క్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌! ఎక్కడంటే..
World Biggest World Trade C
Follow us on

భారతదేశంలోనే అతిపెద్ద ప్రపంచ వాణిజ్య కేంద్రం హైదరాబాద్‌లో నిర్మించబడుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో నిర్మిస్తున్న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియాను 60 ఎకరాల్లో నిర్మించనున్నారు. దీంతో హైదరాబాద్ భారత వాణిజ్య కేంద్రంగా ఆవిర్భవించనుంది.

హైదరాబాద్‌ కు చెందిన ఓ ప్రముఖ సంస్థ శంషాబాద్‌ సమీపంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (డబ్ల్యూటీసీ) నిర్మాణం చేప‌ట్ట‌డానికి రెడీ అవుతోంది. మొదటి దశ పనులు 2025లో ప్రారంభం కానున్నాయి. విస్తీర్ణం పరంగా ఇప్పటి దాకా నేషనల్ కేపిటల్‌ రీజియన్‌ ఢిల్లీ పరిధిలోని నోయిడాలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ 44 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలో ఇప్ప‌టికైతే నోయిడాలో ఉన్న ట్రేడ్ సెంట‌ర్ అతి పెద్ద‌ది. కాగా, రెండో స్థానంలో 43 ఎకరాల్లో విస్తరించిన బీజింగ్‌ డబ్ల్యూటీసీ నిలిచింది. శంషాబాద్‌లో నిర్మించబోయే వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ భవనాలు ఎత్తులో 12 అంతస్థులకే పరిమితం కానున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ స్కైస్క్రాపర్లకు అనుమతి లేదు.

ఇకపోతే, ఈ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణం కోసం రూ.4000 కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఈ డబ్ల్యూటీసీకి అనుబంధంగా సర్వీస్‌ అపార్ట్‌మెంట్లతో పాటు 225 గదుల హోటల్‌ నిర్మాణం కూడా చేపడుతున్నారు. మొత్తంగా వివిధ దశల్లో కలిపి 2035 నాటికి డబ్ల్యూటీసీ పనులు పూర్తి కావచ్చని అంచనా. డబ్ల్యూటీసీ సెంటర్‌ కోసం ఇప్పటికే 15 ఎకరాల స్థల సేకరణ పూర్తవగా నిర్మాణ పనులు తొలి దశలో ఉన్నాయి. మిగిలిన భూసేకణ పనులు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి