Mallanna Sagar project: దేశంలోనే అతి పెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో మహిళామణుల పాత్ర ఎంతో కీలకం.. మొదటి నుంచి చివరి వరకు వివిధ పనుల్లో అతివలు పోషించిన పాత్ర అంత ఇంత కాదనేది జగమెరిగిన సత్యం. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కపూర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ దేశంలోనే అతి పెద్ద రిజర్వాయర్.. 50 టీఎంసీల నీరు నిల్వ ఉండేలాగా దీన్ని నిర్మించారు. ఈఇందులో వివిధ శాఖల్లో కొంతమంది మహిళలు కూడా విధులు నిర్వహించడం విశేషం అనే చెప్పవచ్చు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్.. దీని నిర్మాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. వీటన్నింటిని చూస్తూనే ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు కొంతమంది మహిళ ఉద్యోగులు. ఇప్పుడు మనం చూస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కి, ఒకప్పటి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ చాలా తేడా ఉంది.. ఇక్కడ మహిళలు పని చేయడం అంటే కత్తి మీద సామే అని చెప్పవచ్చు.
మల్లన్న సాగర్ పంపు హౌస్‌లో గత రెండు సంవత్సరాలుగా డీఈగా పనిచేస్తున్నారు శిరీష.. ఉదయం నుండి రాత్రి వరకు పంపు, మోటార్లు చూసుకోవడం ఆమె బాధ్యత.. వీటితో పాటు బయట జరిగే సైట్ వర్క్‌ను కూడా చూసుకోవాలి.. ఈ పనులు చేయడం అంత ఆషామాషీ కాదు అని అంటున్నది శిరీష.. పంప్స్, మోటార్ ఆపరేటింగ్ అంటే ఎదో ఒక స్వీచ్ ఆన్ చేయడం కాదు అని.. దానికి ఎన్నో చేసుకోవాల్సి ఉంటుంది అని చిన్న పోరాపాటు జరిగిన పెద్ద తలనొప్పి అని అంటున్నారు.. దీనికి తోడు లేబర్ పని చేస్తున్నప్పుడు వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా తమకే ఉంటుంది అని… విటిన్నింటి కంటే ముఖ్యమైన విషయం కుంటుంబానికి దూరంగా ఉంటూ ఈ పని చేయడం కొంచెం కష్టమే అని అంటుంది..
మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఫౌండేషన్ వేసి.. రిజర్వాయర్ ఓపెన్ అయ్యే వరకు పూర్తిగా పని చేసిన మరో ముగ్గురు మహిళ ఉద్యోగులు ఉన్నారు.. వారే మంజుల, శకుంతల, అనిత వీరు ముగ్గురు అసిస్టెంట్ ఎక్స్ క్యూటివ్ ఇంజనీర్లు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ చుట్టూ ఉన్న కట్ట పొడవు 21 కిలోమీటర్లు దీన్ని నిర్మాణంలో వీరి పాత్ర చాలా కీలకం అయ్యింది అని చెప్పాలి.. వీరు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ల్యాండ్ పుల్లింగ్ లో సైతం ఉన్నారు.. వివిధ గ్రామాల ప్రజలు తమ భూములు ఇవ్వం అని గొడవలు చేసినప్పుడు కూడా వీరు అందులో ఉన్నారు.. భూ సేకరణలో భాగంగా ఈ ముగ్గురు మహిళ ఉద్యోగులకు కొన్ని గ్రామాల ప్రజలు శాపనార్థాలు కూడా పెట్టిన ఘటనలు ఉన్నాయి.. దీనికి తోడు మొదట్లో ఇక్కడ ఎలాంటి వసతులు లేవు అని… కనీసం తాగడానికి నీరు.. తలదాచుకోవడానికి నీడ కూడా లేని పరిస్థితిలో మేము పని చేసాం అని అంటున్నారు..
-శివతేజ, టీవీ9 తెలుగు