AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంట్లోనే పుట్ట.. దైవంగా భావించిన పామే ఆమె ప్రాణం తీసింది

తన ఇంట్లోనే పుట్ట ఏర్పడింది. అందులో ప్రమాదకర నాగుపాము ఉంది. ఆ పామునే దేవతలా భావించింది ఆ వృద్ధురాలు. కొన్ని సంవత్సరాలుగా ప్రతి రోజు పూజలు చేసింది. ఆ తర్వాత అదే పాము కాటేయడంతో మృతి చెందింది.

Telangana: ఇంట్లోనే పుట్ట.. దైవంగా భావించిన పామే ఆమె ప్రాణం తీసింది
Gangavva
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2024 | 9:25 AM

Share

పాముకు పాలు పోసి పెంచినా విషాన్నే చిమ్ముతుంది అని పెద్దోళ్లు సామెతగా వాడుతుంటారు. ఆ మాట ఇప్పుడు నిజమైంది. అది డేంజరస్ కోబ్రా.. ఓ వృద్ధురాలు ఇంట్లో ఆవాసం ఏర్పరుచుకుంది. ఆ పామును దేవతగా భావించి.. నిత్యం.. పూజలు చేస్తూ.. భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటుంది. ఈ తంతు కొన్నేళ్లుగా జరుగుతుంది. అయితే తాజాగా అదే పాము కాటు వేయడంతో.. ఆమె మృత్యువాత పడిన విషాద ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఖానాపూర్‌ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన 65 ఏళ్ల అలుగుల గంగవ్వకు తనయుడు రాజలింగు, కూతురు పద్మ ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పని చేసిన గంగవ్వ జులై1, 2024 రిటైరై ఇంటి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తోంది.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం గంగవ్వ తన ఇంటి మట్టి నేలను అలుకుతుండగా…  ఒక్కసారిగా పుట్టలో నుంచి బయటకు వచ్చిన నాగుపాము ఆమె చేతిపై పలుమార్లు కాటు వేసింది. దీంతో పరుగున బయటకు వచ్చిన ఆమె.. స్థానికులకు విషయం చెప్పింది. వారు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా… నాటువైద్యం కోసం లింగాపూర్‌కి తీసుకెళ్లారు. అక్కడివారు పరిస్థితి విషమించిందని మందు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఖానాపూర్‌ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే ఆమె మృతి చెందింది. కూతురు పద్మ కంప్లైంట్  మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Follow Us
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..