Extra Marital Affair: మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మరిదితో ఉన్న వివాహేతర సంబంధం.. అందరికీ తెలియడంతో ఓ వివాహిత తన మరిదితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో వివాహిత ప్రాణాలు కోల్పోగా.. ఆమె మరిది పరిస్థితి విషమంగా ఉంది. దేవరకద్ర మండలం గోపనపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపనపల్లికి గ్రామ ఎంపీటీసీ రెండో భార్య(23).. వరుసకు మరిది అయ్యే మధు(22)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
కొన్నాళ్లపాటు రహస్యంగా సాగిన వీర వ్యవహారం ఇటీవల పలువురికి తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన వీరిద్దరూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో పరువు పోయిందనే ఉద్దేశ్యంతో.. ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒకే చీరకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, ఇది గమనించిన స్థానికులు వారిని వెంటనే రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎంపీటీసీ భార్య మార్గంమధ్యలోనే ప్రాణాలు కోల్పోగా.. మధు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దాంతో మధుకు మెరుగైన చికిత్స అందించడం కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బ్రతికే అవకాశాలు తక్కువ అని వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
OPS on Sasikala: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. శశికళపై పన్నీర్ సెల్వం సానుకూల స్పందన
Pattabhi: ఎయిర్‌పోర్ట్‌లో పట్టాభి.. ఎక్కడికి వెళ్లారంటే
Shami: షమీకి వ్యతిరేకంగా జాత్యహంకార వ్యాఖ్యలు.. మండిపడ్డ సెహ్వాగ్