Telangana: డీలక్స్ బస్సు ఎక్కి ఉచిత టికెట్ అడిగిన మహిళ.. ఇవ్వకపోవడంతో..
కొత్తగూడెం ప్రాంతంలో మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తున్న డీలక్స్ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు ఆధార్ కార్డు చూపిస్తూ ఉచిత టికెట్ ఇవ్వమని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం లేనందున కండక్టర్ ఫ్రీ టికెట్ ఇవ్వడాన్ని నిరాకరించాడు. దీంతో ఆ మహిళ

కొత్తగూడెం ప్రాంతంలో మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తున్న డీలక్స్ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు హల్‌చల్ చేసింది. తన ఆధార్ కార్డు చూపిస్తూ, ఉచిత టికెట్ ఇవ్వమని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. డీలక్స్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం లేదని.. కండక్టర్ ఆమెకు టికెట్ కొట్టేందుకు నిరాకరించాడు. దీంతో ఆ మహిళ రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకుని ఆందోళనకు దిగింది. ఈ సంఘటన బస్సులో ప్రయాణిస్తున్న ఇతరులకు కూడా ఆశ్చర్యంగా, కొంత భయం కలిగించింది.
ఆమె ఎంతకీ మాట వినకపోవడంతో.. బస్సు డ్రైవర్, కండక్టర్ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమై ఉంది.
కాగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు, హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. మాత్రమే మహిళలకు ప్రయాణం ఉచితం. తెలంగాణ సరిహద్దు లోపల ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించొచ్చు.
