AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎందుకమ్మా ఇలా చేశావ్..! భర్త శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి..

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.. ఓ మహిళ మూడేళ్ల చిన్నారికి ఉరివేసి.. ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో వేణుగోపాల్ రెడ్డి, లోక సాహితి రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు సంతానం.. ఏమైందో ఏమో కానీ.. ఇంట్లో ఎవరు లేని సమయంలో..

Telangana: ఎందుకమ్మా ఇలా చేశావ్..! భర్త శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి..
Crime News
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 10, 2025 | 9:30 AM

Share

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.. ఓ మహిళ మూడేళ్ల చిన్నారికి ఉరివేసి.. ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో వేణుగోపాల్ రెడ్డి, లోక సాహితి రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు సంతానం.. ఏమైందో ఏమో కానీ.. ఇంట్లో ఎవరు లేని సమయంలో లోక సాహితి రెడ్డి తన మూడు సంవత్సరాల కూతురు రితన్య రెడ్డికి ఉరివేసి.. తర్వాత తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది.

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాల్ రెడ్డితో కరీంనగర్ జిల్లా వెధిర గ్రామానికి చెందిన సాహితీకి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు సంతానం.. మృతురాలి భర్త వేణుగోపాల్ రెడ్డి ఎల్ఐసిలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

అయితే.. బుధవారం భర్త వేణుగోపాల్ రెడ్డి జగిత్యాలలో తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లగా.. సాహితి రెడ్డి పెద్దపల్లిలో తాను కిరాయి కుంటున్న ఇంట్లో కూతుర్ని చంపి.. తాను కూడా ఉరివేసుకొని తనువు చాలించింది.

ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, గత కొంతకాలంగా సాహితీ మానసిక బాగాలేదని సమాచారం. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి వివరాలు బయటకు రాకపోవడంతో.. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు 2026 విడుదల..ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు 2026 విడుదల..ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విచిత్ర వాతావరణం
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విచిత్ర వాతావరణం