AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ డాక్టర్.. ఇక్కడ ఐఏఎస్.. అమాయకంగా కనిపిస్తుందిగా అనుకునేరు.. మహా కిలాడీ..

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్‌ల బాగోతాలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఓ కిలాడి తాను ఐఏఎస్ నంటూ హంగామా చేసింది. రాజకీయ నాయకుల బంధువునని కటింగ్‌లు కొట్టింది. మాయ మాటలతో పురుషులకు వలపు వల వేసి అందిన కాడికి దోచేసింది. ఆమెపై రాష్ట్రంలో అనేక చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి. కిలాడీ ఆగడాలు పెరగడంతో.. దృష్టిపెట్టిన మిర్యాలగూడ పోలీసులు ఎట్టకేలకు మాయదారి లేడి ఆట కట్టించారు.

అక్కడ డాక్టర్.. ఇక్కడ ఐఏఎస్.. అమాయకంగా కనిపిస్తుందిగా అనుకునేరు.. మహా కిలాడీ..
Woman Fruad
M Revan Reddy
| Edited By: |

Updated on: May 27, 2025 | 1:48 PM

Share

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్‌ల బాగోతాలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఓ కిలాడి తాను ఐఏఎస్ నంటూ హంగామా చేసింది. రాజకీయ నాయకుల బంధువునని కటింగ్‌లు కొట్టింది. మాయ మాటలతో పురుషులకు వలపు వల వేసి అందిన కాడికి దోచేసింది. ఆమెపై రాష్ట్రంలో అనేక చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి. కిలాడీ ఆగడాలు పెరగడంతో.. దృష్టిపెట్టిన మిర్యాలగూడ పోలీసులు ఎట్టకేలకు మాయదారి లేడి ఆట కట్టించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత డిగ్రీ వరకు చదువుకుంది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన సరిత ఇతరులను మోసాలు చేయడం అలవాటయింది. హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ తదితర పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉంటూ సమీప మహిళలతో పరిచయం పెంచుకునేది. అదును చూసి వారి సెల్ ఫోన్లు కొట్టేసేది. ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్‌ చేయడంతోపాటు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే.. పోలీసుల విచారణలో దిమ్మతిరేగే వాస్తవాలు వెల్లడయ్యాయి.. సరిత చేస్తున్న దందాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు.

తాను ట్రైనింగ్ ఐఏఎస్ అధికారినంటూ మాయ మాటలు.. పురుషులకు వలపు వలవేసి దోచేసేది. పలువురు యువకులను ట్రాప్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసింది. తరచూ మకాం మారుస్తూ స్నేహంగా నటిస్తూ డబ్బులు తీసుకోవడం, విలువైన సెల్ ఫోన్ లు కొట్టేయడం.. ఆ తర్వాత మరోచోటికి మకాం మార్చేదని పోలీసులు విచారణలో తేలింది.

ఓ చోట ఏఎస్పీ కూతురునని.. రేడియాలజిస్ట్ డాక్టర్ అంటూ మాయ మాటలు చెప్పింది. ఏడాది క్రితం నార్కట్ పల్లిలో ఓ వైద్యున్ని బ్లాక్ మెయిల్ చేసి ఐదు లక్షలు వసూలు చేసింది. కలెక్టర్ అయ్యానంటూ అమాయకులను బురిడీ కొట్టించి బుట్టలో వేసుకుందని పోలీసులు వెల్లడించారు.

సరితపై మలక్ పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్ పీఎస్ లో చోరీ కేసులు, నార్కట్ పల్లి, నల్గొండ వన్ టౌన్ పీఎస్‌లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అయినా తన బుద్ధి మార్చుకోకుండా తిరిగి మోసాలకు పాల్పడుతున్న మాయదారి కిలాడి సరితను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..