
చీమల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వివాహిత మనీషా మరణంపై సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇంత సిల్లీ ఇష్యూకే సూసైడ్ ఏంటి..? వినాడానికే అసహ్యంగా ఉంది అంటూ కొందరు… మరేదైనా కారణం ఉండొచ్చు అంటూ ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి ఆమెది ఆత్మహత్యే అని తేల్చారు. చీమల కారణంగా మరణిస్తున్నట్లు సూసైడ్ నోట్ రాసి మనీషా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కూడా మనీషా ఆత్మహత్య చేసుకుందని ధ్రువీకరించారు. పోస్ట్ మార్టంలో సైతం ఆమెది ఆత్మహత్య అని రూడీ అయిందంటున్నారు.
అయితే ఆమెకు చీమలంటే ఫోబియా ఎందుకు వచ్చిందనే విషయంపై పోలీసులు కీలక విషయాలు చెప్పారు. ఏడాదిన్నర క్రితం.. పాపకు మనీషా డైపర్ వేశారట. ఆ సమయంలో చిన్నారి ఆపకుండా ఏడవడంతో.. అనుమానమొచ్చి చూడగా.. డైపర్‌లో చీమలు ఉన్నాయట. అప్పటి నుంచి ఆమెకు ఈ ఫోబియా అంటుకున్నట్లు మనీష భర్త శ్రీకాంత్ పోలీసులు విచారణలో తెలిపాడు.
ఆమె ఎంత మానసిక సంఘర్షణకు గురైతే ఆత్మహత్య చేసుకుంటుందో అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకండి.. చీమలు గురించిన ఈ భయాన్ని మిర్మెకాఫోబియా అంటారు. ఇదొక తీవ్రమైన భయంతో కూడిన మానసిక స్థితి. వీరికి చీమలు అంటే చాలా భయం ఉంటుంది. చిన్న చీమను కూడా ఏనుగంత పెద్దదిగా ఊహించుకుని ఆందోళన చెందుతారు. అవి తమను పగబట్టాయి అని వాటికి చంపేసే అంతటి శక్తి ఉందని నమ్ముతారు. పరిస్థితి తీవ్రమైనప్పుడు చీమలు.. తమ శరీరంలోకి ప్రవేశించినట్లు తమ అవయవాలను కొరికి తింటున్నట్లు తీవ్ర భయానికి గురవుతారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీతో దీని నుంచి బయటపడొచ్చు.
ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి, పటాన్‌చెరు ఇన్‌స్పెక్టర్ నరేష్ టీవీ9తో ఏం చెప్పారో దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తలు