హైదరాబాద్ జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. జూబ్లీహిల్స్‌లో పోలీస్ స్టేషన్ పరిధి కార్మిక్‌నగర్లోని నీటి సంపులో పడి మహిళ మృతి చెందింది. రాత్రి 11గంటల సమయంలో నీళ్లు రాకపోవడంతో సంపు మూత తెరిచిన మహిళ..ప్రమాదవశాత్తు అందులోపడింది. ఆలస్యంగా గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇంటి ఆవరణలోనే ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు పడిపోయిన మహిళను ఆలస్యంగా గుర్తించారు. స్ధానికుల సాయంతో పోలీసులు ఆమెను బయటకు తీశారు. కానీ, దురదృష్టవశాత్తు మహిళ అప్పటికే నీట్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..