Watch Video: ‘ఏం కష్టం వచ్చిందో..’ కరీంనగర్ ఎల్ఎండీలోకి దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం

ఏం కష్టం వచ్చిందో ఓ వివాహిత నిండు కుండలా పారుతున్న నదిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. మెరుపు వేగంతో స్పందించిన స్థానికులు ఆమెను కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో..

Updated on: Sep 23, 2024 | 6:32 PM

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 23: ఏం కష్టం వచ్చిందో ఓ వివాహిత నిండు కుండలా పారుతున్న నదిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. మెరుపు వేగంతో స్పందించిన స్థానికులు ఆమెను కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..

కరీంనగర్‌ ఎల్ఎండీలో టూరిస్ట్ బోటులో పర్యాటకులతోపాటు సంధ్య అనే వివాహిత కూడా టికెట్ కొనుక్కుని బోటు ఎక్కి కూర్చుంది. అయితే బోట్ స్పీడ్ పెంచగానే వెనక్కి వెళ్లి నీటిలో అమాంతం దూకేసింది. వెంటనే గమనించిన బోట్ డ్రైవర్, బోటులో ప్రయాణిస్తున్న మరికొందరు బోటును నీళ్లపై ఆపేసి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. సేఫ్టీ ప్యాడ్స్‌ నీళ్లలో వదిలి ఆమెను క్షేమంగా బోటులోకి లాగి రక్షించారు. అనంతరం లేక్ పోలీసులకు సమాచారమిచ్చి సదరు మహిళను ప్రభుత్వ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా సంథ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us