సిద్ధిపేట, ఫిబ్రవరి 1: ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రియుడి మోజులో పడి కట్టుకున్నోడికి కాటికి పంపిస్తున్నారు భార్యలు.. పిల్లలున్నా కూడా ప్రియుడే ముద్దు అంటూ మొగుళ్లను మర్డర్లు చేయించే రేంజ్‌కి వెళ్తునర్నారు. మొన్న సంగారెడ్డి జిల్లాలో భర్తని ప్రియుడితో కిడ్నాప్ చేయించి హత్య చేసిన ఘటన మరువకముందే.. సిద్దిపేట జిల్లాలో ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి చంపేసింది భార్య.. ఇలా ప్రియుడితో కలిసి భర్తని హత్య చేసిన ఘటనలు ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో వెలుగు చూశాయి. జనవరి 19న సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మల్లేశం అనే యువకుడిని భార్య కల్పన ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆ తరువాత వారం రోజులకి సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలంపూర్‌లో నివాసముండే నరేశ్‌కు 9 ఏళ్ల క్రితం క్షీరసాగర్ గ్రామానికి చెందిన లతతో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. తరచూ దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుండేవి. మూడు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో నరేశ్ బెడ్ రూంలో విగతజీవిగా పడి ఉన్నాడు. భార్య లత ఇంటి పక్కనే ఉంటున్న మామ మల్లేశ్ వద్దకు వెళ్లి నరేశ్.. ఉరి వేసుకొని చనిపోయాడని చెప్పింది. కొడుకు మృతిపై తండ్రి మల్లేష్‌కి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకి ఫిర్యాదు చేశాడు తండ్రి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని తండ్రి కొడలిపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నరేశ్ భార్య లత, ఆమె ప్రియుడు ములుగు మండలం చిన్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జోగు భువనేశ్ ఇద్దరు కలిసి భర్తని హత్య చేసినట్టు ఒప్పుకుంది. ఈ ఇద్దరు క్షిరాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది. లతకి నరేష్ తో పెళ్లి అయిన తర్వాత లత పుట్టింటికి వెళ్ళినప్పుడు ప్రియుడిని కలిసేది. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి విషయం భర్త నరేశ్ కి తెలియడంతో లతను మందలించాడు.
దీంతో లత తమ పెళ్లికి నరేశ్ అడ్డు వస్తున్నాడని ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. విషయం ప్రియుడు భువనేశ్ కి చెప్పడంతో నరేష్‌ని చంపేయాలని ప్లాన్ వేశారు. ఈ నెల 25న రాత్రి నరేశ్ మద్యం తాగి పడుకున్న తర్వాత లత తన ప్రియుడు భానుకు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి నరేశ్ గొంతు నులిమి చంపేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నరేశ్ ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఇంటి పైకప్పు కొండికి చీరను కట్టి వేలాడదీశారు.
చివరకు పోలీసుల విచారణలో నేరం ఒప్పుకోవడంతో లత, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కి పోలీసులు తరలించారు. ఇటు తండ్రి చనిపోవడం, తల్లి జైలుకి వెళ్లడంతో పిల్లలు అనాధాలుగా అయ్యారు. అక్రమ సంబంధాలతో కుటుంబాలు ఎలా ఆగమవుతున్నాయో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..