
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు దాటింది. తెలంగాణకు రావాల్సిన కీలక నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే నిలిచిపోయాయి. దాదాపు 12 విభాగాలకు సంబంధించి 47 అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. దీంతో బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్ చుట్టూ సుమారు 350 కి.మీ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులతో పాటు రూ.34,367 కోట్లు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం కోరింది. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ “రేడియల్ రోడ్ల కోసం రూ.45,000 కోట్లు అవసరమవుతుంది. ORR నుంచి RRRకి కలుపుతూ కొత్తగా 10 రేడియల్ రోడ్ల అభివృద్ధి ప్రతిపాదలను సీఎం ఇప్పటికే కేంద్రానికి సమర్పించారు. వీటికి రూ.45,000 కోట్ల నిధుల మంజూరు కోరింది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 కోసం రూ.44,028 కోట్లు కోరింది. హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా మెట్రో రైలు ఫేజ్–2 ప్రాజెక్టు కోసం ఫేజ్ 2A, ఫేజ్ 2B ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి.
• గోదావరి నుంచి మూసీకి నీటిని మళ్లించే లింక్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.6,000 కోట్ల ఆర్థిక సాయం కోరింది
• వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) ప్రాజెక్టుకు కేంద్ర నిధులు
• హైదరాబాద్ సమగ్ర మురుగు నీటి మాస్టర్ ప్లాన్ (AMRUT 2.0 / స్పెషల్ ప్రాజెక్ట్)
• బందర్ పోర్ట్ – హైదరాబాద్ డ్రై పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే – రూ.17,000 కోట్లు
• “బందర్ పోర్ట్” నుంచి హైదరాబాద్ సమీప డ్రై పోర్ట్ వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం. దాదాపు రూ.17 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని కోరింది.
• ఆదిలాబాద్, కొత్తగూడెం, బసంత్ నగర్ విమానాశ్రయాలు, ఇటీవలే వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్ లకు ఆమోదం తెలిపింది.
రైల్వే కనెక్టివిటీ – కొత్త లైన్ల ప్రతిపాదనలు
• తెలంగాణలో 8 కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి
• వికారాబాద్–కృష్ణ కొత్త రైలు మార్గం, కల్వకుర్తి–మాచర్ల రైలు లైన్, గద్వాల్–దోర్నకల్ రైలు మార్గం
• కాచిగూడ–జగ్గయ్యపేట రైలు మార్గం, పటాన్‌చెరు–ఆదిలాబాద్ రైలు లైన్, బోధన్–లాతూర్ రోడ్ లైన్, అక్కన్నపేట బైపాస్ రైలు లైన్, పాండురంగాపురం–భద్రాచలం రోడ్ లైన్
• ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చడం
• ఖమ్మం లేదా మహబూబాబాద్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్.
• పీఎం మిత్ర కింద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు కేంద్రం సాయం
• తెలంగాణ రైజింగ్ విజన్–2047 లక్షానికి అనుగుణంగా లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులు
• పవర్ సిస్టం డెవలప్‌మెంట్ ఫండ్ కింద 6 ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు
• PM–KUSUM కింద సోలార్ పంప్ సెట్ల కేటాయింపు
• సింగరేణికి బొగ్గు బ్లాకుల గుర్తింపు
• తాడిచెర్ల కోల్ బ్లాక్–II మైనింగ్ లీజ్
• నవోదయ విద్యాలయాలు లేని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల మంజూరు
• కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు
• హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)
• PMAY–G లో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు
• కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు PMAY–U విస్తరణ