హైదరాబాద్ శివారులో జనానికి చుక్కలు చూపించింది ఓ పిల్లి. కుత్బుల్లాపూర్ గాజులరామారంలోని కైసరనగర్ డబుల్ బెడ్ రూమ్ సమీపంలో అడవి పిల్లి భయాందోళనకు గురి చేసింది. అడవి పిల్లి రావడంతో అది చూసిన జనం చిరుత పులిగా భావించి ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి స్థానికులు అడవి పిల్లిని బంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాన్ని తీసుకుకెళ్లడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.
ఇటీవల కాలంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత పులి తీవ్ర కలకలం సృష్టించింది. ఐదు రోజులు పాటు చిరుత పులి కోసం పెద్ద రిస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. ఏట్టకేలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోన్‌లో అప్పుడు చిక్కింది చిరుత. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న స్థానికులతో పాటు శంషాబాద్ కు వెళ్లే ప్రయాణికులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు తాజాగా గాజులరామారంలో అడవి పిల్లిని చూసిన స్థానికులు సైతం ఉలిక్కిపడ్డారు.
ఏకంగా చిరుత పులి తమ గ్రామంలోకి వచ్చినట్లు మొదటగా భావించినా, అది అడవి పిల్లి అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అడవి పిల్లికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. చిరుత పులి మాదిరిగానే శరీరం మీద పసుపు కలర్ మచ్చలు ఉండడం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు స్థానికులు. చివరికి అటవీ అధికారుల సాయంతో బంధించిన అడవి పిల్లిని అక్కడి నుంచి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…