దెయ్యం పట్టింది.. నోట్లో గుడ్డలు కుక్కి భర్తను చితక్కొట్టిన భార్య.. ఆ తర్వాత సీన్ ఇదే..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ పంచాయతీలోని జంగాల కాలానికి చెందిన గంగారాం (51) తన భార్య చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. గంగారాం,లక్ష్మి ఇద్దరు దంపతులు జంగాల కాలనీలో 35 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే, గంగారాం మద్యానికి బానిస కావటంతో గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

దెయ్యం పట్టింది.. నోట్లో గుడ్డలు కుక్కి భర్తను చితక్కొట్టిన భార్య.. ఆ తర్వాత సీన్ ఇదే..
Crime News

Edited By:

Updated on: Aug 25, 2025 | 9:33 AM

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ పంచాయతీలోని జంగాల కాలానికి చెందిన గంగారాం (51) తన భార్య చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. గంగారాం,లక్ష్మి ఇద్దరు దంపతులు జంగాల కాలనీలో 35 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే, గంగారాం మద్యానికి బానిస కావటంతో గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. రెండు రోజుల క్రితం లక్ష్మి తనకు దెయ్యం పట్టిందంటూ.. పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పడుకున్న భర్తపై ఒక్కసారిగా దాడి చేసింది.. భర్త గంగారం నోటిలో గుడ్డలు కుక్కి చితక్కొట్టింది. ఏకంగా కర్రతో దాడి చేసింది. భార్య దాడిలో తీవ్రంగా గాయపడిన గంగారం.. కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టాడు.. భార్య చేతిలో గాయపడిన గంగారాంను బంధువులు హాస్పటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఎందుకు దాడి చేశావంటూ బంధువులు లక్ష్మిని ప్రశ్నించగా.. తనకు దెయ్యం పట్టిందంటూ వింత వింతగా ప్రవర్తించింది..

దాడి అనంతరం గంగారం.. కావాలనే తన భార్య తనపై దాడి చేసిందని.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. జరిగిందంతా చెప్పాడు.. కావాలనే.. తన భార్య తనను తీవ్రంగా కొట్టిందని, చిత్ర హింసలకు గురి చేసిందని, నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడిందని వీ.ఎం. బంజర్ పోలీసులకు భార్య లక్ష్మిపై గంగారాం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు లక్ష్మిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వీడియో చూడండి..

అయితే గంగారాంకు పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలు అవ్వటంతో చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు.. ప్రస్తుతం గంగారాంకు చికిత్స కొనసాగుతోందని.. బంధువులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..